నవ తెలంగాణ నిర్మిద్దాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: బంగా రు తెలంగాణగా చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ కార్య నిర్వాహక అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. జిల్లాలో వైఎస్ షరిల చేస్తున్న పరామర్శయాత్రలో భాగంగా కోస్గి మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. జోరు వాన లెక్క చేయకుండా సభకు తరలివచ్చిన ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు. నవ తెలంగాణ నిర్మాణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలు పంచుకుంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అంటూ శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. దివంగత సీఎం వైఎస్ ఆశీ స్సులు, జగన్, షర్మిల సహకారంతో కొద్ది రోజుల్లోనే మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ మరణానంతరం నల్లకాలువలో జగన్ ఇచ్చిన హామీ మేరకే షర్మిల పరామర్శ యాత్ర చేస్తున్నారని పొంగులేటి వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ ‘బంగారు తెలంగాణ కావాలని మనమందరం కోరుకున్నాం. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మనమందరమూ సహకరిద్దాం. తెలంగాణ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. కానీ వర్షాలు లేవు. పంటలు లేవు. పనులు లేవు. పశువులకు మేత లేదు. రైతులు అప్పుల పాలై ఆర్నెల్లుగా ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే నాథుడు లేడు. పలకరించే నాయకుడు లేడు’అని ఆవేదన వ్యక్తం చేశారు.
‘ప్రజా సమస్యలను పట్టించుకునే వారు లేరు. ఎమ్మెల్యేలకు నెలసరి వేతనాన్ని మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి రూ.50వేల నుంచి ల క్ష రూపాయలకు పెంచారు. సీఎం కేసీఆర్ లక్ష రూపాయల వేతనాన్ని రెండు లక్షలకు పెంచుతామని ప్రకటించడాన్ని’ కిష్టారెడ్డి ప్రశ్నించారు. ‘నాలుగు రోజులుగా మహానేత వైఎస్ కూతురు షర్మిల మన ముందుకు వచ్చారు. మహానేత వైఎస్ కులం, మతం, ప్రాంతం, పార్టీతో సం బంధం లేకుండా అందరికీ చేతినిండా పని, కడుపునిండా తిండి, కంటినిండా నిద్రతో కూడిన ప్రశాంతమైన జీవితం ప్రసాదించేందుకు అనేక పథకాలు చేపట్టారు.
రైతులు, బలహీనవర్గాలు, విద్యార్థులు ఇలా అన్నివర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఏ సీఎం చేయని విధంగా వైఎస్ ప్రవేశపెట్టారని’ కిష్టారెడ్డి గుర్తు చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆరోగ్య శ్రీ వ ంటి పథకాలను వైఎస్ జిల్లా నుంచే ప్రారంభించిన విషయాన్ని గుర్తుచేశారు. గురువారం జరిగిన నాలుగోరోజు పరామర్శ యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్‌రావు, భీష్వ రవీందర్, మాదిరెడ్డి భగవంతురెడ్డి, నర్సింహారెడ్డి, ఎం.రవీందర్‌రెడ్డి, హైదర్, వాజిద్, బంగి లక్ష్మణ్, జెట్టి రాజశేఖర్, హన్మంతు, నసీర్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.