హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 101, 535 జీవోలపై సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే ఈ పిటిషన్ పై వచ్చే వారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోలపై ఎస్సీ రైట్స్ కమిషన్ పిటిషన్ దాఖలు చేసింది. జీవోల ద్వారా ఏర్పాటు చేసిన కమిటీలు నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఎస్సీ లబ్దిదారుల కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీల్లో సోషల్ వర్కర్లు పేరిట అధికార పార్టీ నేతలు చొరబడుతున్నారని తెలిపారు. దీన్ని నియంత్రించకుంటే..పథకాల అమల్లో పక్షపాతంతో పాటు. స్థానిక సంస్థల నిర్వీర్యం జరుగుతుందని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.