gos
-
జీవోలు రహస్యంగా ఉంచడానికి వీల్లేదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వెబ్సైట్లో కొన్ని జీవోలు మాత్రమే అప్లోడ్ చేసి.. మిగిలిన వాటిని ప్రజలకు తెలియకుండా రహస్యంగా ఉంచడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. జీవోలన్నింటినీ ఎలా పడితే అలా కాకుండా ప్రజలకు అర్థమయ్యేందుకు వీలుగా.. ఓ వరుస క్రమంలో అప్లోడ్ చేయాల్సిందేనని తేలి్చచెప్పింది. ఏదైనా జీవోలో రహస్య సమాచారం ఉంటే.. ఆ విషయాన్ని కూడా జీవో ద్వారా తెలపాలని ఆదేశించింది. దీని వల్ల మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని.. ప్రజలకు సమాచారం తెలిసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. అలాగే జీవోలను గతంలో మాదిరిగా వరుస క్రమంలో జీవోఐఆర్ వెబ్సైట్లో అప్లోడ్ చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవోలను ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచకపోవడం సమాచార హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ నెల్లూరుకు చెందిన జీఎంఎన్‌ఎస్ దేవి, గుంటూరుకు చెందిన కె.శ్రీనివాసరావు, అనంతపురం జిల్లాకు చెందిన ఎస్.ఆర్.ఆంజనేయులు, బాపట్ల జిల్లాకు చెందిన సింగయ్య తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, జీవోలన్నీ అప్లోడ్ చేస్తున్నామని చెప్పారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు స్పందిస్తూ.. గతంలో మాదిరిగా వరుస క్రమంలో జీవోలను అప్లోడ్ చేయడం లేదన్నారు. దీని వల్ల జీవోల వివరాలు తెలిసే అవకాశం లేదని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. జీవోలను ఓ వరుస క్రమంలో అప్లోడ్ చేయాల్సిందేనని ఆదేశించింది. -
ఓట్ల వేటలో సర్కారు ఎరలు..!
-జీఓలు : 18, 54, 16, 17లపై ఉపాధ్యాయ సంఘాల నేతలు -ఎమ్మెల్సీ కోడ్ అమలు గురించి తెలిసే జారీ చేశారని వ్యాఖ్య భానుగుడి(కాకినాడ) : రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సోమవారం ఒకేసారి మూడు రకాల జీవోలు వెలువడ్డాయి. కొన్నేళ్లుగా పోరాడుతున్న పండిట్, పీఈటీల అప్గ్రడేషన్ను అమలు చేస్తూ జీవో : 18, మున్సిపల్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు గెజిటెడ్ హోదా కల్పిస్తూ జీవో :54, ఎంఈఓల వయోపరిమితి నిబంధనను తొలగిస్తూ జీవో :16, 17 విడుదల కావడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం పెల్లుబికింది. అయితే ప్రస్తుతం పలు జిల్లాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ జీవోల్లో ఏ ఒక్కటీ అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల వేళ ఉపాధ్యాయుల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రభుత్వం వేస్తున్న ‘ఎర’ల్లో భాగమే ఈ జీవోలని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. జిల్లాలో అప్‌గ్రేడ్ కానున్న 471 ఉపాధ్యాయులు. జిల్లాలో తెలుగు పండిట్ 142, హిందీ 124, ఉర్దూ 12, సంస్కృతం 01, తమిళం 02, పీడీ(పీఈటీ) 190 మొత్తం 471 మందిలో పండిట్లు స్కూల్ అసిస్టెంట్లుగా, పీఈటీలు ఫిజికల్ డైరెక్టర్లుగాను అప్‌గ్రేడ్ అవుతున్నారు. జీవో :54తో 43 మందికి గెజిటెడ్ హోదా. మున్సిపల్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న 43 మందికి జీవో : 54తో గెజిటెడ్ హోదా రానుంది. కాకినాడలో 14, అమలాపురంలో 2, మండపేటలో 1, రామచంద్రపురంలో 3, సామర్లకోటలో 3, రాజమండ్రిలో 13, పెద్దాపురంలో 2, పిఠాపురంలో 3, తుని ఇద్దరు ఉపాధ్యాయులు గెజిటెడ్ హోదా పొందనున్నారు. ఎంఈవోలు కానున్న 58 మంది హెచ్ఎంలు జీవో :16, 17తో జిల్లాలో 58 మంది ప్రధానోపాధ్యాయులు సీనియార్టీ ఆధారంగా ఎంఈవోలుగా పదోన్నతి పొందనున్నారు. మొన్నమొన్ననే వీరిని కౌన్సెలింగ్‌కు పిలిచినా 55 ఏళ్ల వయోపరిమితి వి««ధించడంతో కౌన్సెలింగ్ రద్దయింది. ప్రస్తుత జీవోల్లో వయోపరిమితిని పూర్తిగా తొలగించారు. వేచి చూడాల్సిందే.. అయితే కొన్ని జిల్లాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కోడ్‌ను అమలు చేయడంతో ఈ జీవోల అమలుకు అడ్డంకి కానుంది. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెలువడితేగాని రాష్ట్రవ్యాప్తంగా ఈ జీవోలు అమలులోకి రావు. ఇంకొన్నాళ్ళు వేచి చూస్తాం వ్యాయామోపాధ్యాయుల అప్గ్రడేషన్కు దీర్ఘకాలికంగా పోరాడుతున్నాం. మరికొంతకాలం వేచి ఉంటాం. ఎన్నికల విషయం తెలిసే జీవోలు విడుదల చేశారు. ఉన్నతాధికారులు ఉపాధ్యాయులతో ఏ విధంగా ఆడుకుంటున్నారో అన్న దానికి ఇదొక నిదర్శనం. -ఎల్.జార్జి, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి ఓట్ల కోసమే ఊరింపు జీవోలు విడుదల చేసిన పెద్దలకు ఎన్నికల కోడ్ అమలులో ఉన్న విషయం తెలియనిది కాదు. అయితే ఎన్నికల సమయంలో ఉపాధ్యాయుల ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రభుత్వాలు ఊరింపు చర్యలకు పాల్పడతాయనడానికి ఇదొక నిదర్శనం. -డీవీ రాఘవులు , యూటీఎఫ్ అధ్యక్షుడు -
26 నెలల పాలనలో 16 సార్లు మొట్టికాయలు
* టీఆర్ఎస్పై వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఫైర్ * జీవో 123ని కొట్టివేసినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శ * అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ 26 నెలల పాలనలో హైకోర్టు 16 సార్లు మొట్టికాయలు వేసిందని.. ఆయా జీవోలు, నిర్ణయాలను తప్పుబట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది టీఆర్ఎస్ సర్కారుకు సిగ్గుచేటని పేర్కొన్నారు. జీవో 123ను కొట్టివేయడంపై అప్పీలుకు వెళతామనడం ఎందుకని ప్రశ్నించారు. ప్రాజెక్టుల కోసం రైతులు, ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గట్టు శ్రీకాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బంగారు తెలంగాణ అంటే రైతుల కడుపు నింపేలా ఉండాలే తప్ప కడుపు కొట్టేలా ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు తమ తీర్పుల ద్వారా ఒకరకంగా ప్రభుత్వాన్ని అభిశంసించే తీరులో వ్యాఖ్యానాలు చేసినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేదని విమర్శించారు. భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా ఇతర మార్గాల్లో భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే తమ పార్టీ అడ్డుకుంటుందన్నారు. అవసరమైతే ఎంత స్థాయి వరకైనా పోరాడుతామని చెప్పారు. రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీచేస్తామని ప్రభుత్వం ఘనంగా ప్రకటించిందని.. కానీ ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ వస్తోందని విమర్శించారు. ప్రభుత్వం నిబద్ధతతో పనిచేయకుండా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ పోవడం సరికాదని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు లాఠీలు, తూటాలతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు అదేదారిలో సాగుతోందని విమర్శించారు. 26 నెలల్లో ఒక్క ప్రాజెక్టు చేపట్టారా? గత 26 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఒక్క ప్రాజెక్టునైనా పూర్తిచేసి, అదనంగా ఒక్క టీఎంసీ నీటినైనా పొలాలకు పారించారా అని గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టుల ద్వారానే ఇప్పుడు నీళ్లు వస్తున్న విషయం గ్రహించాలని సూచించారు. ప్రాజెక్టుల విషయంలో వైఎస్సార్సీపీ పూర్తి మద్దతునిస్తుందని చెప్పారు. ‘ప్రతి చెయ్యికి పని, ప్రతి చేనుకు నీరు’ అనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి జరిపిన కృషి మరవలేనిదని పేర్కొన్నారు. -
దొంగ జీవోల జారీ - అదుపులో ఆరుగురు
-
101, 535 జీవోలపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 101, 535 జీవోలపై సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే ఈ పిటిషన్ పై వచ్చే వారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోలపై ఎస్సీ రైట్స్ కమిషన్ పిటిషన్ దాఖలు చేసింది. జీవోల ద్వారా ఏర్పాటు చేసిన కమిటీలు నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ లబ్దిదారుల కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీల్లో సోషల్ వర్కర్లు పేరిట అధికార పార్టీ నేతలు చొరబడుతున్నారని తెలిపారు. దీన్ని నియంత్రించకుంటే..పథకాల అమల్లో పక్షపాతంతో పాటు. స్థానిక సంస్థల నిర్వీర్యం జరుగుతుందని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.