పీజీ మెడికల్ రీ-ఎంట్రన్స్ రద్దు చేయం | PG Medical Re Entrance as per your schedule | Sakshi
Sakshi News home page

పీజీ మెడికల్ రీ-ఎంట్రన్స్ రద్దు చేయం

Published Fri, Apr 25 2014 4:58 PM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM

PG Medical Re Entrance as per your schedule

హైదరాబాద్: పీజీ మెడికల్ రీ-ఎంట్రన్స్ నిర్వహించొద్దంటూ దాఖలైన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 27న జరగనున్న ప్రవేశ పరీక్షను యథావిధిగా నిర్వహించాలని సూచించింది. ఇంతకుముందు నిర్వహించిన పీజీ మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయని సీబీసీఐడీ విచారణలో తేలడంతో రద్దు చేసిన సంగతి తెలిసిందే.

రీ-ఎంట్రన్స్‌కు డాక్టర్ ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌పీజీఎంఈటీ - 2014గా నామకరణం చేశారు. గత నెల 2వ తేదీన నిర్వహించిన పీజీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్తగా దరఖాస్తు చేసుకోనవసరం లేదని వీసీ చెప్పారు. ఏదేనీ కారణంతో ఇంతకుముందు పీజీఎంఈటీ-14కు దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement