ఎచ్చెర్ల: భవిష్యత్ అంతా ఫార్మారంగానిదేనని ముంబయికి చెందిన ఐపీఏ సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ టీవీ నారాయణ అన్నారు. చిలకపాలేం సమీపంలోని శివానీ కాలేజ్ ఆఫ్ పార్మసీలో బుధవారం ‘ఫార్మా కార్నివాల్- 2016 నేషనల్ లెవల్ సింపోషియం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశ ంలో శరవేగంగా ఫార్మారంగం విస్తరిస్తోందన్నారు. బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మాడీ వంటి కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఫార్మసిస్టులకు విదేశాల్లో వైద్యులతో సమానగుర్తింపు లభిస్తోందని చెప్పారు. వైద్యులు రోగాలు నిర్థారిస్తే ఫార్మసిస్టులు మందులు నిర్ణయిస్తారన్నారు.
విద్యార్థులు విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. జేఎన్‌టీయూ కాకినాడ బోర్డాఫ్ స్టడీస్ చెర్మైన్ ప్రొఫెసర్ కేపీఆర్ చౌదిరి మాట్లాడుతూ విద్యార్థులు ఫార్మారంగంలో రాణించాలంటే ప్రస్తుత ట్రెండ్ తెలుకోవాలన్నారు. ప్రస్తుతం నైపుణ్యాలు ఆధారంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ కాకినాడ ఫార్మసీ డెరైక్టర్ డాక్టర్ ఎస్‌వీయూ ఎం.ప్రసాద్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, ఎస్‌ఎస్‌ఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రమేష్‌బాబు, మేనేజ్ మెంట్ సభ్యులు వీఎంఎం సాయినాథ్‌రెడ్డి, పి.దుర్గాప్రసాద్‌రాజు, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ ఫార్మారంగానిదే..
Published Wed, Mar 16 2016 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM
Advertisement
Advertisement