
ఏలూరు టౌన్: ప్రజాసంకల్పయాత్రకు వస్తున్న అనూహ్య స్పందనతో పాటు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని సర్వేలు సూచిస్తుండడంతో చంద్రబాబునాయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబంపై కక్ష సాధిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఉభయగోదావరి జిల్లాల మహిళా సమన్వయకర్త, బీసీ డిక్లరేషన్ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యురాలు పిళ్లంగోళ్ల శ్రీలక్ష్మి అన్నారు. అందుకే వైఎస్ భారతిని కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. శనివారం ఆమె ఏలూరులో మాట్లాడుతూ వైఎస్ జగన్, ఆయన కుటుంబాన్ని వేధించాలని చూస్తే చివరికి నష్టపోయేది టీడీపీయేననే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
వైఎస్ జగన్‌పై కాంగ్రెస్‌తో కుమ్మక్కై కేసులు పెట్టారని, వాటికి సంబంధించి ఇప్పటివరకూ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని, కోర్టులో కేసులు నిలబడే పరిస్థితి కూడా కనిపించకపోవడంతో చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా కొత్త డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నాయని, జగన్ నిజంగా అవినీతికి పాల్పడి ఉంటే ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. మీకు నిజంగా సత్తా ఉంటే ప్రజాక్షేత్రంలో జగన్‌మోహన్‌రెడ్డితో పోటీపడాలని శ్రీలక్ష్మి సవాల్ విసిరారు. చంద్రబాబు అరాచకాలను ప్రజలంతా గమనిస్తున్నారని, ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతారని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment