అప్కాబ్ చైర్మన్గా పిన్నమనేని నామినేషన్ | Pinnamaneni venkateswara rao nomination on apcob chairman | Sakshi
Sakshi News home page

అప్కాబ్ చైర్మన్గా పిన్నమనేని నామినేషన్

Published Fri, Apr 10 2015 11:28 AM | Last Updated on Thu, Mar 28 2019 5:39 PM

అప్కాబ్ చైర్మన్గా పిన్నమనేని నామినేషన్ - Sakshi

అప్కాబ్ చైర్మన్గా పిన్నమనేని నామినేషన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాకార బ్యాంక్ (అప్కాబ్) చైర్మన్ పదవికి మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం హైదరాబాద్లో అప్కాబ్ ప్రధాన కార్యాలయంలో ఆయన నామినేషన్ వేశారు. ఉపాధ్యక్ష పదవికి వరుపుల రాజా నామినేషన్ వేశారు. అయితే వీరిద్దరి ఎన్నిక లాంఛన ప్రాయమేనని సమాచారం.

అప్కాబ్ ఎన్నికలపై సీఎం చంద్రబాబు గురువారం పలువురు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నేతలతో సచివాలయంలో భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా అప్కాబ్ ఎన్నికల బాధ్యతను అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవుకు బాబు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement