విజయవాడ బ్యూరో : రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన దిశగా సీపీఐ సమరశంఖం మోగించనుంది. ఇందులోభాగంగా ఈ నెల 11న రాష్ర్టంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని ముట్టడించనుంది. ఈ మేరకు మహాసభ తీర్మానించిందని ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. నగరంలో నిర్వహించిన రాష్ట్ర 25వ మహాసభల్లో ఎన్నికైన నూతన కార్యదర్శివర్గంతో కలసి ఆయనశుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం చెప్పిన ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ డిమాండ ్ల సాధనకోసం తమ పార్టీ ఉద్యమిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించనున్నామన్నారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్... బీజేపీ, టీడీపీలకు మద్దతు పలికి తరువాత ఆ విషయం మరిచిపోయారంటూ ఎద్దేవా చేశారు.