గోల్డ్ ప్లస్ ఆయిల్ పేరుతో నకిలీ నూనె తయారు చేస్తున్న కంపెనీపై పోలీసులు దాడులు నిర్వహించారు.
కాకినాడ: గోల్డ్ ప్లస్ ఆయిల్ పేరుతో నకిలీ నూనె తయారు చేస్తున్న కంపెనీపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పారిశ్రామిక వాడలో శనివారం వెలుగు చూసింది. కల్తీ నూనె తయారు చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 900 ఆయిల్ క్యాన్‌లను స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.