ప్రేమికులచేత గుంజీళ్లు తీయించిన పోలీసులు | police misbehaved with lovers at golconda | Sakshi
Sakshi News home page

ప్రేమికులచేత గుంజీళ్లు తీయించిన పోలీసులు

Published Mon, Dec 23 2013 5:23 PM | Last Updated on Sat, Sep 2 2017 1:53 AM

ప్రేమికులచేత గుంజీళ్లు తీయించిన పోలీసులు

ప్రేమికులచేత గుంజీళ్లు తీయించిన పోలీసులు

హైదరాబాద్: గోల్కొండ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రేమికుల చేత గుంజీళ్లు తీయించారు.  గోల్కొండ కోట చూసేందుకు వచ్చిన యువజంటలపై పోలీస్ జులుంను పలువురు విమర్శిస్తున్నారు.  ప్రేమికుల చేత బహిరంగంగా పోలీసులు గుంజీళ్లు తీయించడం వివాదాలకు దారి తీసింది. మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి.

 ఇనస్పెక్టర్‌ సయ్యద్‌ నజీముద్దీన్ ఒంటరిగా ఉన్న యువతీ, యువకులను అదుపులోకి తీసుకుని గుంజీళ్లు తీయించారు. అమ్మాయిలని కూడా చూడకుండా విపరీతంగా ప్రవర్తించారు. వారి చెంపలు కూడా వాయించినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల కళ్లు గప్పి పెడదారి పడుతున్న వారికి బుద్ధిచెప్పేందుకే ఇలా చేశామని ఇన్‌స్పెక్టర్ సయ్యద్‌ తన చర్యను సమర్ధించుకుంటున్నారు. అయితే పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అందరి మధ్యలో వారిని ఇలా అవమానించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement