నెల్లూరు : నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెరుకుమోడిలో కోడి పందాలపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, 9 సెల్ ఫోన్లు, 5 బైకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.