ఆయన కాలి గోటికి సరిపోరు: ఎంపీ పొన్నం
కరీంనగర్: కేంద్ర మంత్రి ఎస్. జైపాల్రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టిన రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్పై ఎంపీ పొన్నం ప్రభాకర్ త్రీవ్రస్థాయిలో మండిపడ్డారు. జైపాల్‌రెడ్డిని విమర్శించే వాళ్లు ఆయన కాలిగోటికి సరిపోరని ఘాటుగా బదులిచ్చారు. తెలంగాణపై చర్చించేందుకు తనతో చర్చకు రావాలని ఉండవల్లికి ఆయన సవాల్ విసిరారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు వంటి మహోన్నత వ్యక్తులు పుట్టిన ప్రాంతంలో ఇప్పుడు శుంఠలు పుట్టారని తెలంగాణ వ్యతిరేకులనుద్దేశించి జైపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉండవల్లి తప్పుబట్టారు. కేంద్రమంత్రి అయివుండి సీమాంధ్రులను కించపరచడం పద్దతి కాదని హితవు పలికారు. తెలంగాణపై జైపాల్‌రెడ్డితో ముఖాముఖి చర్చకు సిద్ధమని ప్రకటించారు.