అక్రమంగా నిలవ చేసిన ఎర్రచందనం దుంగలను శనివారం ఉదయం కర్నూలు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సిమెంట్ తయారీ కేంద్రంలో లారీలో అక్రమంగా నిల్వ ఉంచిన 19 ఎర్ర చందనం దుంగలను గుర్తించిన పోలీసులు లారీ సహా దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న సిమెంట్ మిశ్రమం తయారు చేసే కేంద్రంలో ఎర్ర చందనం దుంగలను దాచి ఉంచారనే సమాచారంతో దాడులు నిర్వహించారు. లారీలోని పొట్టు బస్తాల మధ్య దాచి ఉంచిన ఎర్ర చందనం దుంగలు పోలీసులు కనుగొన్నారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకొని వాటి విలువ అంచనా వేస్తున్నారు.