మళ్లీ విద్యుత్ కోతలు
విజయనగరం మున్సిపాలిటీ : జిల్లాలో రెండు రోజులుగా విద్యు త్ శాఖాధికారులు అనధికారికంగా కోత లు విధిస్తున్నారు. పలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ కేటాయింపులు నిలిచి పోయాయి. దీంతో కోతలు అనివార్యమవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఆది, సోమవారాల్లో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా ఎడాపెడా కోతలు అమలు చేశారు. జిల్లాలో గృహావసర విద్యుత్ సర్వీసులకు ఆదివారం రాత్రి 11.15 నుంచి అర్ధరాత్రి 12.10 గంటల వరకు.. మళ్లీ వేకువ జామున 5.00 నుంచి 5.45 గంటల వరకుజిల్లా కేంద్రం మినహా అన్ని ప్రాంతాల్లోనూ కోత విధించారు.
అలాగే సోమవా రం ఉదయం 7.45 నుంచి 10.05 గంటల వరకు జిల్లావ్యాప్తంగా కోత విధించారు. సాయంత్రం 4.50 నుంచి 6.25 వరకు మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కోతలు విధించారు. రెండు రోజులు విద్యుత్‌ను అధి కంగా వినియోగించే ఫెర్రో పరిశ్రమలకు వినియోగంపై ఆంక్షలు విధించా రు.ప్రతి రోజూ సాయంత్రం 6.30నుంచి అర్ధరాత్రి 12గంటల వరకు కేవలం లైటింగ్ లోడు మాత్రమే విని యోగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి వద్ద ప్రస్తావించగా.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల జిల్లాలో అనధికారిక కోతలు విధిస్తున్నట్లు తెలిపారు. ఇదే పరిస్థితి బుధవారం అర్ధరాత్రి వరకు ఉండవచ్చునని చెప్పారు.