తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసినట్లు తమ విచారణలో తేలిందని కృష్ణా వాటర్ బోర్డు ఛైర్మన్ ఎస్.కె.జి. పండిట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిపారు. శ్రీశైలం నీటి వివాదంపై త్వరలోనే రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగింపుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాయలసీమ ఎడారి అవుతుందని కృష్ణా వాటర్ బోర్డు ఛైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు.
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపేశారు: పండిట్
Published Fri, Oct 24 2014 6:15 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement