skg pandit
-
నీటి యుద్ధం మొదలు!
హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధం మొదలైంది. కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి(కెఆర్ఎంబి-కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం వాడివేడిగా జరుగుతోంది. శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని ఏపి అధికారులు పట్టుబడుతున్నారు. 834 అడుగులే ఉండాలని తెలంగాణ అధికారులు వాదిస్తున్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీటి విడుదల ఆపాలని కూడా తెలంగాణ అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశానికి కెఆర్ఎంబి చైర్మన్ ఎస్కేజీ పండిత్, గోదావరి నదీజలాల నిర్వహణ మండలి చైర్మన్ అగర్వాల్, తెలంగాణ, ఏపి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో అజెండాలోని 9 అంశాలపై చర్చిస్తున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తిపైన, బోర్డు అధికారులకు కార్యాలయాల కేటాయింపు, పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలపై కూడా చర్చిస్తారు. ** -
కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి సమావేశం
హైదరాబాద్: కృష్ణా నదీజలాల నిర్వహణ మండలి(కెఆర్ఎంబి-కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కెఆర్ఎంబి చైర్మన్ ఎస్కేజీ పండిత్, గోదావరి నదీజలాల నిర్వహణ మండలి చైర్మన్ అగర్వాల్, తెలంగాణ, ఏపి రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో అజెండాలోని 9 అంశాలపై చర్చిస్తారు. కృష్ణా జలాల వినియోగం, శ్రీశైలం, నాగార్జున సాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తిపై ప్రధానంగా చర్చిస్తారు. బోర్డు అధికారులకు కార్యాలయాల కేటాయింపు, పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వలపై కూడా చర్చిస్తారు. ** -
తెలంగాణపై చంద్రబాబు కక్ష కట్టారు: కేసీఆర్
-
తెలంగాణపై చంద్రబాబు కక్ష కట్టారు: కేసీఆర్
హైదరాబాద్: నాగార్జున సాగర్ మొదలుకుని పోతిరెడ్డిపాడు వరకు తమకు జరిగిన అన్యాయాన్ని కృష్ణా వాటర్ బోర్డు చైర్మన్ ఎస్.కె.జి. పండిట్ కు వివరించామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. సోమవారం కృష్ణా వాటర్ బోర్డు చైర్మన్ తో ఆయన సమావేశం అయ్యారు. భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రా పాలకులు అడ్డుపడినా జాతీయ నాయకత్వాన్ని ఒప్పించి తెలంగాణ తెచ్చుకున్నామని.. అందుకే తెలంగాణపై చంద్రబాబు కక్ష కట్టారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విఫలమైందని చెప్పడమే చంద్రబాబు లక్ష్యమన్నారు. నీళ్లు, కరెంట్ విషయంలో కుట్ర చేస్తున్నారని, విభజన చట్టం ప్రకారం తమకు దక్కాల్సిన 54 శాతం వాటా దక్కకుండా చేస్తున్నారని వాపోయారు. తెలంగాణకు జరుగుతున్న అన్ని అన్యాయాలను కృష్ణా వాటర్ బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. కృష్ణా వాటర్ బోర్డు కచ్చితంగా వ్యవహరించి తెలంగాణకు న్యాయం చేయాలన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని ఎస్.కె.జి. పండిట్ హామీయిచ్చారని కేసీఆర్ తెలిపారు. -
కృష్ణా బోర్డుకు బాబు ఫిర్యాదు
శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిపై తక్షణం స్పందించండి నిల్వలు పడిపోతే రాయల సీమకు నీటి కష్టాలు తప్పవని వెల్లడి జోక్యం చేసుకోవాలంటూ కేంద్రానికీ ఏపీ సర్కారు లేఖ సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తే రాయలసీమకు తాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంటుందని కృష్ణా బోర్డు చైర్మన్ ఎస్కేజీ పండిత్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. నీటి కొరత వల్ల శ్రీశైలం కుడి కాల్వ, కేసీ కెనాల్ ఆయకట్టు కింద ఉన్న దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో పంట చేతికందకుండా పోతుందని పేర్కొన్నారు. శ్రీశైలంలో విద్యుదుత్పత్తి నిలిపేయాలని ఈ నెల 21న కృష్ణా బోర్డు ఇచ్చిన ఆదేశాలనూ తెలంగాణ సర్కారు పట్టించుకోలేదని తెలిపారు. ఈ విషయంలో బోర్డు తక్షణం జోక్యం చేసుకొని ఏపీకి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా బోర్డు చైర్మన్ పండిత్ శుక్రవారం సచివాలయంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. సమస్య పరిష్కారానికి తన పరిధిలో అన్ని చర్యలు చేపడతానని పండిత్ హామీ ఇచ్చారు. బోర్డు నిస్పాక్షికంగా వ్యవహరిస్తుందని, రెండు రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ కోసం పనిచేస్తుందని చెప్పారు. వచ్చే వారం బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని అంశాలను చర్చిస్తామన్నారు. కాగా, ఈ భేటీకి ముందే ఈ వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తూ ఏపీ సర్కారు లేఖ రాసింది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి వల్ల శ్రీశైలంలో నీటిమట్టం వేగంగా పడిపోతోందని, బోర్డు ఆదేశాలనూ పరిగణించనందున తక్షణం జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కేంద్ర జల వనరుల శాఖకు విజ్ఞప్తి చేసింది. రాయలసీమలో పూర్తిగా పంట నష్టపోయే ప్రమాదముందని, ఆయా ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగవచ్చని, శాంతి భద్రతలకూ విఘాతం కలిగే ప్రమాదముందని ఏపీ సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు నాగార్జున సాగర్ వద్ద కూడా తెలంగాణ సర్కారు విద్యుత్ ఉత్పత్తిని పెంచడంతో భారీగా నీరు దిగువకు విడుదలవుతున్న విషయంపై ఏపీ అధికారులు చర్చించారు. -
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆపేశారు: పండిట్
తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసినట్లు తమ విచారణలో తేలిందని కృష్ణా వాటర్ బోర్డు ఛైర్మన్ ఎస్.కె.జి. పండిట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలిపారు. శ్రీశైలం నీటి వివాదంపై త్వరలోనే రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగింపుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రాయలసీమ ఎడారి అవుతుందని కృష్ణా వాటర్ బోర్డు ఛైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు.