
'పవన్ కల్యాణ్ ఓ స్టార్ హీరో మాత్రమే'
పవన్ కళ్యాణ్ ఓ స్టార్ హీరో మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ ఓ స్టార్ హీరో మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి (టీఎస్ఆర్ ) స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్కు రాజకీయ అనుభవం లేదన్నారు. గురువారం టీఎస్ఆర్ విశాఖపట్నంలో మాట్లాడుతూ...త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ ప్రభావం అంతగా ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర విభజనకు బీజేపీ మద్దతు ఇచ్చిందని, అలాంటి పార్టీకి పవన్ కల్యాణ్ మద్దతు పలకడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. ఏనాడు కనీసం సభలు,సమాజ సేవా కార్యక్రమాలకు హాజరుకానీ పవన్ కల్యాణ్ పార్టీ పెట్టడం విడ్డూరంగా ఉందని టీఎస్ఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చిరంజీవి ఓ ఫోర్స్గా టీఎస్ఆర్ అభివర్ణించారు. ఆయన్ని ఎదుర్కొనే సత్తా ఎవరికి లేదన్నారు.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చిన ఇజం పుస్తకాన్ని నేడు విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ ఆడిటోరియంలో ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్ పై విధంగా స్పందించారు.