
సాక్షి, శ్రీకాకుళం : అలుపెరుగని మోముతో రాష్ట్ర ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 323వ రోజు షెడ్యూల్ ఖరారైంది. రాజన్న తనయుడు చేపట్టిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. రాజన్న తనయుడు సోమవారం ఉదయం నరసన్నపేట నియోజకవర్గంలోని జమ్ము జంక్షన్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి టెక్కలిపాడు క్రాస్, రావడపేట, చిన్నదుగాం జంక్షన్, నారాయణ వలస, రాణ జంక్షన్ మీదుగా లింగాల వలస వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
ముగిసిన పాదయాత్ర : రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత 322వ రోజు ప్రజాసంకల్పయాత్ర ఆదివారం జమ్ము జంక్షన్ వద్ద ముగిసింది. వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం నరసన్నపేట నియోజకవర్గంలోని దేవాది శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిచారు. అక్కడి నుంచి కొమ్మర్తి, గుండువల్లిపేట, సత్యవరం క్రాస్ మీదుగా నరసన్న పేట, జమ్ము వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగింది. నేడు వైఎస్ జగన్ 9.6 కిలో మీటర్ల దూరం నడిచారు. ఇప్పటి వరకు జననేత 3,462.3 కిలో మీటర్లు నడిచారు.