
అశుభమని చవితికి ముందే నిమజ్జనం
రోడ్డు ప్రమాదంలో విషాదం చోటు చేసుకోవడంతో ఆ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అశుభమని భావించిన యువకులు విగ్రహాన్ని దేవునికడప చెరువుకు తీసుకెళ్లారు. ప్రతిష్ఠకు ముందే వినాయకున్ని నిమజ్జనం చేసి వెనుదిరిగారు. ట్రాక్టర్‌ను ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ లో ఉంచారు. ట్రాఫిక్ ఎస్‌ఐ చాంద్‌బాష తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను విచారించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.