ఏ పంట సాగు చేసినా రైతన్నకు కాలం కలిసి రావడం లేదు. అప్పోసప్పో చేసి పంట సాగు చేయడం.. ధరల్లేకనో.. ప్రకృతి వైపరీత్యాలతోనో పంట నష్టపోతూనే ఉన్నాడు. అప్పుల భారం మోయలేక ఆపసోపాలు పడుతున్నాడు. నిన్న టమోట పంట నట్టేట ముంచగా.. నేడు కళింగర రోడ్డు పాలు చేసింది. రైతు గుండె బరువెక్కేలా చేసింది.
కడప అగ్రికల్చర్,న్యూస్‌లైన్: ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలు నూర్పిళ్ల సమయంలో అధిక వర్షాలకు తుడిచి పెట్టుకుపోవడంతో రైతులు కళింగర సాగు చేశారు. జిల్లాలోని చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, రామాపురం, చక్రాయపేట, వేంపల్లె, వేముల, పులి వెందుల, తొండూరు, లింగాల, చాపాడు, రాజు పాలెం, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో మొత్తం 7500 ఎకరాల్లో కళింగర సాగు చేశారు. పంట సాగుకు ఎకరానికి విత్తనాలు, రసాయనిక, సేంద్రియ, పోషక ఎరువులు తదితరవాటికి రూ. 20 వేల వరకు పెట్టుబడి పెట్టారు.
కుప్పకూలిన ధరలు..
పంట సాగు సమయంలో టన్ను రూ. 5 నుంచి 6 వేలు పలకడంతో రైతులు ఎంతో ఆశించారు. తీరా పంట కోతకు వచ్చే సమయానికి ఒక్కసారిగా కుప్పకూలి రూ. 3 వేలకు పలుకుతున్నాయి. ఎకరానికి దిగుబడి ఎకరానికి 5,6 టన్నులు వచ్చిందని .. ప్రస్తుత ధర ప్రకారం రూ.15 నుంచి రూ.18వేలు మించి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారులు ఏమంటున్నారంటే..
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో చలి ఎక్కువ గా ఉండడంతో అక్కడి నుంచి ఎగుమతి ఆర్డర్లు రానందున పంటను కొనుగోలు చేయలేకపోతున్నామని స్థానిక వ్యాపారులు అంటున్నారు. మరోవైపు ధరలు ఎక్కువగా ఉన్న చెన్నై, హైదరాబాదు, బెంగుళూరు నగరాలకు తరలించడం లో మార్కెటింగ్‌శాఖ అధికారులు ఆసక్తి చూ పాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.
చేతి నుంచే పడుతోంది....
మూడున్నర ఎకరా కళింగర పంట వేశాను. పంట మార్కెట్‌కు వచ్చే సరికి ధర పడిపోయింది. కాయలను మార్కెట్‌కు తీసుకువస్తే ట్రాక్టరు బాడుగ రూ.1500లు చేతి నుంచి పెట్టుకున్నాను. - బిచ్చన్న, వెంకట్రామపల్లె, సీకేదిన్నె
ఇలా ఉంటే పంటలేలా పండించాలి....
పంటసాగు చేసినప్పటి నుంచి కోత వరకు ధర లు నిలకడగా ఉండడం లేదు. పెట్టిన పెట్టుబడులైనా వస్తే చాలనే పరిస్థితులు రైతుల్లో ఉం టోంది. ఇలా ఉంటే పంటలెలా పండించాలి.
- మల్లారెడ్డి,వెంకట్రామపల్లె, సీకేదిన్నె
ధర తగ్గిన కళింగర
Published Sun, Jan 26 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement