
సాక్షి, విజయవాడ: ప్రైవేటు ట్రావెల్ వోల్వో బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. 40 మంది ప్రయాణికులతో వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒమర్ కాళేశ్వరి ట్రావెల్స్ బస్సు శనివారం అర్ధరాత్రి సీతన్నపేట గేటు సెంటర్ దగ్గర స్వల్ప ప్రమాదానికి గురైంది. అతి వేగంగా వచ్చిన బస్సు అదుపు తప్పి ఆటోను ఢీ కొట్టింది. తర్వాత వంతెన గోడను ఢీకొని ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదంతో బస్సు కుదుపులకు గురికావడంతో భయభ్రాంతులకి లోనైన పలువురు ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని బయటకు దూకేశారు.
తాము క్షేమంగా బయటపడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు బస్సును స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులను మరో బస్సులో హైదరాబాద్‌కు పంపించారు. తీవ్రంగా గాయపడిన ఆటోడ్రైవర్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment