పులస కేజీన్నర @ రూ.3 వేలు
కాకినాడ (మలికిపురం) : గోదావరికి వరదనీరు తగలడంతో పులసల తాకిడి మొదలైంది. వశిష్ట నదిలో తొలిసారిగా పెదలంక మత్స్యకారులకు బుధవారం పులస చేప చిక్కింది. దాన్ని మలికిపురం మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. సుమారు కేజీన్నర బరువున్న ఈ పులస రూ. 3 వేలకు అమ్ముడైంది.