కదిరి: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు శుక్రవారం రాత్రి శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఉత్సవంలోనూ నారసింహుడు మాత్రమే తిరు వీధుల్లో విహరించేవారు. శేషవాహనంపై మాత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగారు. బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, పట్టు పీతాంబరాలతో విశేషాలంకరణలో ఉన్న ఖాద్రీశుడు రాత్రి తొమ్మిది గంటలకు శేషవాహనంపై కొలువుదీరారు.
స్వామివారి దివ్య మంగళరూపాన్ని భక్తులు దర్శించుకుని తరించారు. స్వామి వారు తిరు వీధులగుండా విహరించేందుకు ప్రధాన గోపురం వద్దకు రాగానే.. భక్తులు గోవింద నామస్మరణతో మార్మోగించారు. శేష వాహనంపై ఉన్న స్వామి వారిని దర్శించుకుంటే నాగదోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు అలయంలో నిత్యాన్నదానం చేశారు. ఆలయ ప్రాంగణంలోని అద్దె గదులు ఖాళీగా లేకపోవడంతో భక్తులు కటిక నేలపైనే నిద్రించారు. శేష వాహన ఉభయదారులుగా యాదాలం శ్రీనివాసులు, బాలాజీ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
శేషవాహనంపై ఊరేగిన ఖాద్రీశుడు
Published Sun, Mar 8 2015 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM
Advertisement