నాణ్యమైన విద్య..
నాణ్యమైన విద్య.. మిథ్య!
పురాతన బోధనా పద్ధతులకు స్వస్తి పలికి విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి కలిగించే విధంగా వినూత్న విధానాలను ప్రవేశపెడుతున్నా అవి సత్ఫలితాలను ఇవ్వడంలేదు. నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం ప్రసార మాధ్యమాలను వినియోగించాలని నిర్ణరుుంచింది.
సర్వశిక్ష అభియాన్, రాజీవ్ విద్యామిషన్ పథకాలను తీసుకువచ్చి టీవీలు, రేడియోలను పాఠశాలకు అందజేశారు. అంతవరకు బాగానే ఉన్నా కరెంట్ కనెక్షన్ లేకపోవడంతో టీవీలు అటకెక్కాయి. ఇక రేడియో పాఠాలు విద్యార్థులకు ఆసక్తి కలిగిస్తున్నా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో కుదరడంలేదు. ఫలితంగా అనుకున్న లక్ష్యాలు సాధించడంలేదు. -
అడ్డాకులసర్కారు బడిలో చదువుకునే విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన విద్యనందించాలని ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి పాఠశాలలకు టెలివి జన్‌లను అందజేసినా ప్రయోజనం మాత్రం ఉండటంలేదు. అదే ప్రైవేటు పాఠశాలల్లో అయితే 1వ తరగతి నుంచే విద్యార్థులకు కంప్యూటర్లను అందుబాటులో ఉంచి శిక్షణనిస్తున్నారు. మరి మన ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం టీవీలనైనా ఉపయోగించని దుస్థితి దాపురించడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. సర్వశిక్ష అభియాన్, రాజీవ్ విద్యా మిషన్ ద్వారా మండలంలో 5 పాఠశాలలకు టెలి విజన్‌లతో పాటు సీడీ, డీవీడీ ప్లేయర్లను ప్రభుత్వం సరఫరా చేసింది.
అడ్డాకుల మండలంలో 32 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. వీటికి గాను నందిపేట, తిమ్మాయిపల్లి తండా, గుడిబండ, కొమిరెడ్డిపల్లి, కాటవరం ప్రాథమికోన్నత పాఠశాలలకు టెలి విజన్‌లను అందజేశారు. వాటిలో కేవలం నందిపేట, తిమ్మాయిపల్లితండాలో మాత్రమే టీవీలు పని చేస్తున్నాయి. మిగతా పాఠశాలల్లో టీవీలు మూలకు చేరా యి. ఇక ఆర్‌ఓటీ కింద వేము ల, కందూరు, అడ్డాకుల, జానంపేట స్కూల్ కాంప్లెక్స్ పాఠశాలలకు టీవీలతో పాటు డీష్‌లను పంపిణీ చేశారు. వీటిలో అడ్డాకులలో మాత్రమే ఇటీవల కొన్నాళ్ల నుంచి టీవీని ఉపయోగిస్తున్నారు.
ఇక్కడ జనరేటర్ సక్రమంగా పని చేయడంలేదు. ఇక జా నంపేట, కందూరులో ఆర్‌ఓటీలు లేకపోవడంతో టీవీలు అటకెక్కాయి. వీటిని స్కూల్ కాంపెక్స్ సమావేశాలప్పుడు మాత్రమే వినియోగిస్తూ టీవీలు, డీష్‌లను డబ్బాల్లో పెట్టి మూలన పడేస్తున్నారు. మొత్తంగా కరెంటు సరఫరా టీవీల వినియోగంపై తీవ్ర ప్రభావం చూపడం విద్యార్థులకు తీరని లోటును కలిగిస్తోంది.
రేడియో పాఠాలపై మిశ్రమ స్పందన
రేడియోలలో పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. విందాం నేర్చుకుందాం..మీనా ప్రపంచం తదితర రేడియో పాఠాలను పిల్లలకు వినిపిస్తున్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో పరివర్తనకు కారణమవుతోంది. ఎదుగుతున్న దశలో విద్యార్థులకు ఇది వరంలాంటిది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ కార్యక్రమం విద్యార్థులను ఆకర్షిస్తోంది.