చావంటే లెక్క లేదు
- వడదెబ్బ మృతులు నలుగురేనట?
- అధికారుల నిర్ధారణ
- పరిహారం ఎగవేతకే అంటున్న బాధిత కుటుంబాలు
- తహశీల్దార్ల లెక్కల్లో73 మరణాలు నమోదు
వారం రోజులుగా ఎండలు భగ్గుమంటున్నాయి. వడగాడ్పులు వృద్ధులు, పిల్లలకు ఊపిరాడకుండా చేస్తున్నాయి. రోజూ పదుల కొద్ది జనం ఉసురు తీస్తున్నాయి. ఇలా అధికారికంగానే జిల్లాలో 73 మంది మృతి చెందినట్లు మండలాల వారీగా తహశీల్దార్ల నుంచి కలెక్టరేట్‌కు నివేదికలు అందాయి. అయితే వీరిలో కేవలం నలుగురు మాత్రం వడదెబ్బ కారణంగా మరణించారట..! మిగిలిన వారు గుండె ఆగడం వంటి ఇతర కారణాలతో మృతిచెందారని నిర్ధారించారు. దీంతో బాధితుల కుటుంబాలు ఆవేదన చెందుతున్నారు. పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే అధికారులు ఇలా తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
విశాఖ రూరల్ : ఆపద్భందు పథకంలో నిబంధనలు కొంత మంది పాలిట శాపంగా పరిణమించాయి. వడదెబ్బ మరణాలను గుర్తించేందుకు గత ఏడాది ప్రభుత్వం సంబంధిత ప్రాంత పోలీస్, తహశీల్దార్, వైద్యుడితో కూడిన ముగు ్గరు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. వడదెబ్బ కారణంగా ఎవరైనా మరణిస్తే వెంటనే పోలీసులకు చెబితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. వైద్యులు మరణానికి గల కారణాలను పరీక్షిస్తారు. వారి సిఫా ర్సు మేరకే పరిహారం లభిస్తుంది.
ఈ విధంగా ప్రస్తుతం 73 మంది గడచిన ఐదురోజుల్లో చనిపోగా అందులో కేవ లం నలుగురు మాత్రమే వడదెబ్బకు మరణించారని తేల్చారు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ కూడా నివేదిక ఇవ్వనుంది. దీని ప్రకారం భీమిలిలో ధని యాల రామారావు, పెదగంట్యాడలో సిరినగరి నరసింహమూర్తి, కె.కోటపాడులో బండారు ఎర్రయ్యమ్మ, సబ్బవరంలో పిల్లి పోతురాజుల కుటుంబ స భ్యులకు మాత్రమే ఆపద్బంధు పథకం కింద రూ.50 వేలు, ప్రభుత్వం ప్రకటిం చిన రూ.లక్ష అందనుంది.
అయితే కొం త మంది ఆపద్బంధు విషయం తెలియకపోవడం వల్ల ఈ పథకానికి అర్హత సా ధించలేకపోయారని అధికారులు చెబుతున్నారు. కాగా నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందనే వడదెబ్బ మరణాలకు ఇతర కారణాలు చూపిస్తున్నారని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
1996 నుంచి 1999 వరకు ఆపద్బంధు పథకం కింద రూ.లక్ష ఇచ్చేవారు. తరువాత పరిహారాన్ని రూ.50 వేలకు కుదించారు. తాజాగా ఆపద్బంధుతో పాటు మరో రూ.లక్ష అదనంగా పరిహా రాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మరణాలకు పరిహారాన్ని తక్కువ మందికి ఇవ్వడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.