గందరగోళం, భయందోళన కలిగించే విధంగా...: రఘువీరా
హైదరాబాద్:
ప్రజల్లో గందరగోళం, భయందోళన కలిగించే విధంగా ఉందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగంపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉభయసభల్లో గవర్నర్ చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకోలేకపోయిందని ఆయన అన్నారు.
ప్రజలకిచ్చిన హామీలపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్ వివరణ కోరాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వాలు అమలు చేయాలని
ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు.
ప్రభుత్వాలు వారి బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే గవర్నర్‌తో ప్రసంగాలు చేయించాయన్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజు చేసిన సంతకాలపైనా వివరణ కోరాలని గవర్నర్ కు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సూచించారు.