
వెదురుకుప్పం: విరిగిపడిన కొబ్బరి చెట్టు
గంగాధరనెల్లూరు : జిల్లాలోని వేర్వేరు మండలాల్లో మంగళవారం సాయంత్రం గాలీవాన బీభత్సవం సృష్టించింది. దీంతో రైతులకు సుమారు రూ.కోటి నష్టం వాటిల్లింది. గంగాధరనెల్లూరు మండలంలో గాలీవానకు మామిడి రైతులకు తీర ని నష్టం వాటిల్లింది. ఉన్నట్లుండి ఆకాశం మేఘావృతమై పెనుగాలులు వీయడంతో మామిడికా యలు చెట్ల నుంచి రాలి పోయాయి. మండలం లోని లక్ష్మీరెడ్డిపల్లె, నెల్లేపల్లె, పెద్దమిట్టపల్లె, చిన్నమిట్టపల్లె, వెజ్జుపల్లె, కలిజవేడు, నందనూరు, గ్రా మాల్లో సుమారు 200 టన్నుల మామిడి కాయలు నేల రాలాయని రైతులు అంటున్నారు. దీంతో సు మారు రూ.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. సరివిరెడ్డిపల్లె, చెన్నారెడ్డిపల్లె గ్రా మాల్లో వడగండ్ల వర్షం కురిసింది. సుమారు ఒకటిన్నర పదును వర్షం కురిసినట్లు రైతులు పేర్కొన్నారు. వీరకనెల్లూరు పంచాయతీ పేటనత్తంలో అమ్ములుకు చెందిన రేకుల ఇల్లు పూర్తిగా నేలకూలింది. రూ.లక్ష ఆస్తినష్టం సంభవించింది. విం జంలో విద్యుత్ స్తంభం నేల కూలింది. పెద్దచెట్లు సైతం పడిపోయాయి.
వెదురుకుప్పం మండలంలో..
వెదురుకుప్పం : మండలంలోని బొమ్మయ్యపల్లె పంచాయతీలో మంగళవారం పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలులకు జడబాపనల్లెలో రెండు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అ లాగే కొబ్బరి చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ లైన్లు ధ్వంసం కావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బొమ్మయ్యపల్లె, దేవరగుడిపల్లె, తిరుమలయ్యపల్లె పంచాయతీల్లో గాలులకు మామిడి కాయలు నేలరాలాయి.
గుడిపాలలో 100 ఎకరాల అరటి నేలపాలు
గుడిపాల : మండలంలో మంగళవారం సాయంత్రం గాలీవాన బీభత్సానికి 100 ఎకరాలకు పైగా అరటి పంట నేలపాలైంది. చిత్తపార, పాపసముద్రం, పిళ్లారికుప్పం, అడవిచేను, గుడిపాల, వెప్పాలమానుచేను ప్రాంతాల్లో అరటి పంట ధ్వంసం అయ్యింది. అలాగే మామిడి కాయలు రాలిపోయాయి. కొన్ని గ్రామాల్లో ఇంటి పైకప్పుకు ఉన్న రేకులు ఎగిరిపోయాయి. అలాగే గుడిపాలలో జా తీయ రహదారి పక్కన ఉన్న వాటర్‌ట్యాంక్ వద్ద ట్రాక్టర్‌పై విద్యుత్ స్తంభం ట్రాక్టర్ ఇంజిన్‌పై పడింది. దీంతో ఇంజిన్ భాగం దెబ్బతింది. పేయనపల్లె వద్ద ఉన్న అంగన్‌వాడీ కేంద్రం, రోడ్డుపక్కన ఓ చెట్టు విరిగిపడడంతో కొంతసేపు ట్రాపిక్‌కు అంతరాయం ఏర్పడింది.
బంగారుపాళెంలో..
బంగారుపాళెం : మండలంలో మంగళవారం గాలీవాన బీభత్సం సృష్టించింది. బంగారుపాళెం, కరిడివారిపల్లె, రాగిమానుపెంట, వెలుతురుచేను, బోడబండ్ల తదితర గ్రామాల్లో పలువురు రైతులకు చెందిన మామిడితోటల్లో కాయలు నేలరాలిపోయాయి. చెట్లు విరిగిపోయాయి, రాగిమానుపెం ట గ్రామానికి చెందిన మునెమ్మ, ఉమ్మర్‌బాషాకు చెందిన ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
శ్రీరంగరాజపురంలో..
శ్రీరంగరాజపురం : మండలంలోని మూలూరు, మర్రిపల్లె, శెట్టివానత్తం, తాటిమాకులపల్లె, చిన్నతయ్యూరు, నెళవాయి గ్రామాల్లో గాలీవాన కురిసింది. దీంతో వీధుల్లో వర్షపు నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహించింది. పెనుగాలులు వీయడంతో పలు గ్రామాల్లో పంట నేలపాలైంది. నాలుగు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మామిడి కాయలు రాలిపోయాయి. అలాగే ఆకు తోటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
ఐరాల మండలంలో..
ఐరాల : మండలంలో మంగళవారం వీచిన ఈదురుగాలులకు మామిడి చెట్లు నేలకొరిగాయి. అలాగే విద్యుత్ స్తంభాలు విరిగిపోయి, సరఫరాకు అంతరాయం కలిగింది. మండలంలోని పొలకల, నాంపల్లె, ఐరాల, కోళ్లపల్లె, ఎం.పైపల్లె, ఎగువ చ వటపల్లె, మద్దిపట్ల పల్లె, ముదిగోళం, కాణిపాకం పంచాయతీల్లో ఓమోస్తరు వర్షం కురిసింది. ముదిగోళం, ఎగువ చవటపల్లె, ఎం.పైపల్లె పంచాయతీల్లో అధిక నష్టం వాటిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment