కోస్తాలో సోమవారం రాత్రివరకు ఒకట్రెండుచోట్ల జల్లులు కురిసే అవకాశముంది.
విశాఖపట్నం: కోస్తాలో సోమవారం రాత్రివరకు ఒకట్రెండుచోట్ల క్యుములోనింబస్ మేఘాల కారణంగా మోస్తరువర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు పేర్కొన్నారు. సముద్రంనుంచి, దక్షిణ, నైరుతిదిశల నుంచి తేమగాలులు అధికంగా వస్తుండడం కూడా వర్షాలు కురవడానికి అవకాశాల్ని కల్పిస్తున్నాయన్నారు.