మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం పశ్చిమ దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది.
విశాఖపట్నం: మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం పశ్చిమ దిశగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఇది మరింత గా బలహీనపడి ఆదివారానికి అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వచ్చే 24 గంటల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది.
అదే సమయంలో తీరం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సముద్రం ఒకింత అలజడిగా ఉంటుందని, చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు ఆం ధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి.