13టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
Published Sun, Nov 10 2013 1:56 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
ఏటీఅగ్రహారం (గుంటూరు), న్యూస్‌లైన్: రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి ఇతర జిల్లాకు తరలిస్తున్న లారీని విజిలెన్స్ అధికారులు శనివారం గుర్తించి సీజ్‌చేశారు. లారీలోని 13 టన్నుల రేషన్ రీసైక్లింగ్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ కిషోర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. వినుకొండ మం డలం నరగాయపాలేనికి చెందిన లక్ష్మీట్రేడర్స్ రైస్ మిల్లు నిర్వాహకుడు డి.శ్రీనివాసరెడ్డి, అదే గ్రామానికి చెందిన మద్దినేని ఆంజనేయులు సహాయంతో మండల పరిధిలోని గ్రామాల నుంచి రేషన్‌బియ్యం సేకరించారు. రైస్‌మిల్లులో మొత్తం 13టన్నుల రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి 25కేజీల వంతున 652 బ్యాగు ల్లో తరలించేందుకు సిద్ధంచేశాడు. లోడు చేసిన లారీ శనివారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంనకు బయలుదేరింది. ముందస్తు సమాచారంతో నల్లపాడు సమీపంలో లారీని తనిఖీ చేసి రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ ఎన్.సతీష్, క్లీనర్ షేక్ జానీబాషాలను అరెస్టుచేశారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తరలిస్తున్నందుకు రైస్‌మిల్లు యజమాని డి.శ్రీనివాసరెడ్డి, గుమస్తా ఉమామహేశ్వరరావు, మద్దినేని ఆంజనేయులుతోపాటు డ్రైవరు, క్లీనర్‌పై కూడా 6 ఏ, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సీఐ బి.వంశీధర్, కిషోర్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement