సాక్షి,విశాఖపట్నం: చౌకదుకాణాల్లో బియ్యం,అమ్మహస్తం సరకులు నెలాఖరు వరకు రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేయాలని పౌరసరఫరాలశాఖ నిర్ణయించింది. ఈమేరకు డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ప్రతినెలా 15వ తేదీతో చౌకదుకాణాల్లో రేషన్ పంపిణీ పూర్తయ్యేది. సమైక్య ఉద్యమం కారణంగా జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు రేషన్ సరకులు ఈ నెల ఆలస్యంగా చేరాయి. దీంతో పంపిణీలోనూ జాప్యం చోటుచేసుకుంది.
ఉద్యమం ప్రభావంతో చాలామంది మధ్య,దిగువతరగతి ప్రజలకు ఉపాధిలేక ఆదాయం కూడా తగ్గింది. ఈనేపథ్యంలో సరకులు విడిపించుకునే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా బియ్యం నిల్వలు చాలావరకు డీలర్లవద్ద ఉండి పోయాయి. అమ్మహస్తం సరకులు 55శాతమే అమ్ముడుపోయాయి.
ఈనేపథ్యంలో ఈనెల30 వరకు కార్డుదారులు కోటా విడిపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. మరో పక్క ఉద్యమం తో గోదాముల నుంచి బియ్యం, పప్పులు రావడంలేదు. దీనివల్ల ప్రతినెలా సరకుల పంపిణీ ఆలస్యమవుతోంది. వచ్చే నెల నుంచి ఈ సమ స్య ఉత్పన్నం కాకుండా ముందుగానే రవాణా ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు.
నెలాఖరు వరకు రేషన్
Published Sat, Sep 21 2013 3:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM
Advertisement