ప్రాణాలతో చెలగాటం | reason for the sloppy driving accidents | Sakshi
Sakshi News home page

ప్రాణాలతో చెలగాటం

Published Mon, Aug 3 2015 12:05 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

reason for the sloppy driving accidents

డ్రైవింగ్‌పై అలసత్వమే ప్రమాదాలకు కారణం
త్వరగా గమ్యం చేరాలన్నదే అందరి ఆత్రుత
 డ్రైవర్‌కు తగిన నిద్ర లేకున్నా పట్టించుకోరు
వాహనం ఫిట్‌నెస్‌పైనా తగిన శ్రద్ధ పెట్టరు

 
విహార యాత్రలకు వెళ్లాలి. బిలబిలమంటూ బంధుమిత్రులతో బయలుదేరారు. ఓ బస్సు బుక్ చేసుకున్నారు. ఎంతో ఉత్సాహంగా బయలుదేరిన వారి ప్రయాణంలో అపశ్రుతి.. వాహనం కండిషన్‌లో లేకపోవడంతో ప్రమాదానికి లోనైంది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
 
అర్జెంటు పని తగిలింది. తెల్లారేసరికి ఊరు చేరాలి. డ్రైవర్‌ను ఆగమేఘాల మీద బయల్దేరదీశారు. సరిగా నిద్ర ఉందా లేదా అని పట్టించుకోలేదు. మరో అరగంటలో గమ్యం చేరుతారనగా డ్రైవర్‌కు చిన్నగా నిద్ర తూగింది. పెద్ద ప్రమాదమే జరిగింది. కుటుంబం మొత్తం బుగ్గిపాలైంది. వార్తా పత్రికలను తిరగేస్తే చాలు. నిత్యం ఇలాంటి దుర్ఘటనలు కోకొల్లలు. ఎవరికి వారు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటివేవీ లేకపోవడంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

తాటిచెట్లపాలెం(విశాఖ): హెల్మెట్ పెట్టుకోమంటే భారంగా భావిస్తారు. కారులో సీట్ బెల్ట్ పెట్టుకోమంటే చాదస్తమంటారు. ప్రజలు ప్రమాదాలంటే బేఫికర్‌గా ఉన్నారు. మృత్యువు తమ దాకా రాదన్న ధీమా.. ప్రమాదాలను తప్పించుకోగలమన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం.. కానీ జరగాల్సిన దారుణాలు జరిగిపోతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న తీర్థయాత్రలకు వెళ్లి వస్తూ ధవళేశ్వరం బ్యారేజీపై నుంచి వాహనం బోల్తా పడి అచ్యుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన 22మంది మృత్యువాత పడ్డారు. ఆ దుర్ఘటనను మరచిపోకముందే గోదావరి పుష్కరాలకు వెళ్లి వస్తూ ప్రమాదాలకు లోనైన వాహనాలెన్నో.. గాల్లో కలిసిన ప్రాణాలెన్నో.. లెక్కేలేదు.
 డ్రైవర్ గోడు ఎవరూ పట్టించుకోరు..

 ప్రయాణం భద్రంగా సాగడంలో వాహనచోదకుడి పాత్ర అత్యంత కీలకం. అతని సాధకబాధకాలను పట్టించుకుంటేనే పయనం సజావుగా సాగుతుంది.నిరంతరం డ్రైవింగ్ చేసేవారు తరచూ కంటి చూపు, సుగర్, రక్తపోటు స్థాయులను పరీక్షించుకుంటూ ఉండాలి.వెనుక సరైన సపోర్ట్ లేకపోయినా, కూర్చున్న సీట్ సక్రమంగా ఎడ్జెస్ట్ కాకపోయినా వెన్ను, నడుం భాగాలపై ఒత్తిడి పడుతుంది.170 సెంటీమీటర్లకంటే తక్కువ ఎత్తు ఉన్నవారు, 180 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నవారు.. తాము డ్రైవ్ చేసే వాహనాన్ని సరిగా ఎంపిక చేసుకోవాలి.{yైవింగ్ సీటులో ఉన్నవారు సెల్‌ఫోన్ సంగతి మరచిపోవాలి. అర్జంట్ అయితే తప్ప ఫోన్ కాల్‌కు బదులు ఇవ్వరాదు.
     
వాహనం నడపడంలో కళ్లకే ఎక్కువ శ్రమ ఉంటుంది. నిద్ర సరిగా ఉంటేనే కళ్లు ఫ్రెష్‌గా ఉండి.. సూదంటు రాయిలా పనిచేస్తాయి.మద్యం తాగి డ్రైవ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదు. ట్రావెల్స్‌లో ప్రయాణించే ప్రజలు, ప్రైవేటు వాహనాలు నడిపేవారి కుటుంబ సభ్యులు వారిని నిలువరించాలి.  రోడ్డుపై నిలిపిన వాహనాలే చాలా ప్రమాదాలకు కారణం. అందుకోసం స్థలం కేటాయించినా చాలామంది అడ్డంగా నిలిపివేస్తున్నారు. అధికారులు వారిని నిరోధించాలి. ఎవరికి వారు అలా వాహనాలు నిలపకుండా జాగ్రత్త వహించాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement