వ్యతిరేకిస్తున్న విద్యుత్‌రంగ నిపుణులు
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయేతర ఇంధన (ఎన్‌సీఈ) వనరుల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌కు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ధర ఖరారు చేసింది. ఈ మేరకు ఈఆర్‌సీ చైర్మన్ భాస్కర్, సభ్యులు రాజగోపాల్ రెడ్డి, అశోకాచారిలు శనివారం ఆదేశాలు జారీ చేశారు. బగాసీ, బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాల ద్వారా ఉత్పత్తి చేసే సంప్రదాయేతర ఇంధన వనరులకు ఈఆర్‌సీ వేరియబుల్ టారిఫ్ (అస్థిర చార్జీలు)ను నిర్ణయించింది. 2014-15 నుంచి 2018-2019 ఆర్థిక సంవత్సరం వరకు అంటే రానున్న ఐదేళ్ల కాలానికి ధరలను ఖరారు చేసింది. బగాసీ అంటే చెరుకు పిప్పి ద్వారా విద్యుత్‌ను తయారుచేసే ప్లాంట్లకు యూనిట్‌కు రూ.2.73 నుంచి రూ.3.44 వరకు చెల్లించాలని నిర్ణయించింది. పారిశ్రామిక వ్యర్థాలతో పాటు బయోమాస్ (ఊక) ద్వారా ఉత్పత్తి చేసే యూనిట్ విద్యుత్‌కు రూ.4.28 నుంచి రూ.5.40 వరకు ధర నిర్ణయించింది. అరుుతే ఈఆర్‌సీ ఆదేశాలపై విద్యుత్‌రంగ నిపుణులు మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ హడావుడి నిర్ణయాలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత ఈఆర్‌సీ ఆరు నెలల పాటే కొనసాగనుండగా రెండు రాష్ట్రాలకు వేర్వేరు ఈఆర్‌సీలు ఏర్పాటుకానున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ప్రైవేటు ప్లాం ట్లకు మేలు చేకూరేలా ఆదేశాలు జారీ చేయడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
అస్థిర చార్జీల వివరాలు (రూ.లలో)
ఆర్థిక సంవత్సరం బగాసీ బయోమాస్,
పారిశ్రామిక వ్యర్థాలు
2014-15 2.73 4.28
2015-16 2.89 4.54
2016-17 3.06 4.81
2017-18 3.25 5.10
2018-19 3.44 5.40
2014-19 ఆర్థిక సంవత్సరాలకు ఈఆర్‌సీ ఆదేశాలు
Published Sun, May 18 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:28 AM
Advertisement