జిల్లాలో ఉద్యోగుల భవిష్యత్ ఇప్పుడు రాజకీయనేతల చేతుల్లో ఉంది. వారి సిఫార్సులు, పైరవీలపై ఆధారపడి బదిలీలు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే జాబితాలు ఇమ్మని తమ పార్టీ నేతలను మంత్రి మృణాళిని కోరినట్టు సమాచారం. సిఫార్సుల కారణంగా కొందరికి లాభం చేకూరనుంది. చాలా మంది బలయ్యేఅవకాశం ఉంది. పైరవీలు కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయి.
సాక్షిప్రతినిధి, విజయనగరం: రాజకీయ నాయకుల కనుసన్నల్లో బదిలీల బం తాట మొదలైంది. పరిపాలనా సౌలభ్యం మాటున ఉద్యోగుల బదిలీల మార్గదర్శకాలు రాజకీయ రంగుపులుముకున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయంతో ఉద్యోగుల ఉత్సాహం ఒక్కసారిగా నీరుగారిపోయింది. ఇప్పుడు ఎవ రు ఎవర్ని బదిలీ చేస్తారో? ఎక్కడికి బలిచేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లా అధికారులతో పాటు మండల స్థాయి అధికారులు, వీఆర్వో, కార్యదర్శి వంటి ఉద్యోగులను బదిలీ చేసేందుకు రాజకీయ నాయకులు కసరత్తు చేస్తున్నారు. జెడ్పీటీసీల నుంచి ఎమ్మెల్యేల వరకూ జాబితాలు సిద్ధం చేశారు. ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని రహస్య సమావేశం నిర్వహించి రాజకీయ బదిలీలకు తెరలేపారని తెలిసింది.
ఎవరెవరికి ఎక్కడెక్కడికి బదిలీ చేయాలో అన్న విషయంపై జాబితాలు ఇస్తే అలా చేస్తామని సమావేశంలో చెప్పినట్టు అంతా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే నాయకులు తమకు అనుకూలమైన అధికారులతో జాబితా సిద్ధంచేసుకున్నారు. ఇష్టంలేని అధికారులను శంకరగిరి మాన్యాలు పట్టించనున్నారు. కలెక్టర్ ఎంఎం నాయక్ హైదరాబాద్ వెళ్లడంతో అక్కడ ఇన్‌చార్జి మంత్రితో పాటు ఇక్కడి మంత్రితో కూడా చర్చించి బదిలీలను సిద్ధం చేసే అవకాశముందని చెబుతున్నారు. మరో పక్క అధికారులు కూడా తమకు నచ్చిన చోటికి బదిలీ అయేందుకు నాయకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. మీరు ఏది చెబితే అదే చేస్తామని ఇప్పటినుంచే వారికి మాట ఇస్తూ తమ స్థానాలను పదిలం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
చేతులు మారుతున్న సొమ్ములు
ఇక బదిలీల పేరుతో పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. పైసల వసూళ్లకు కొంతమంది నాయకులు తెగబడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు నచ్చిన చోటికి బదిలీ చేయించుకునేందుకు రాజకీయ నాయకులు అధికారుల వద్ద నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారని తెలిసింది. ఇక బదిలీలు ఏ స్థాయిలో జరుగుతాయో! ఎంత మేర డబ్బులు చేతులు మారుతాయో వేచి చూడాల్సిందే!
సిఫార్సులు, పైరవీలకు ఉద్యోగుల బదిలి!
Published Sat, Jun 27 2015 1:49 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM
Advertisement
Advertisement