ఆశలు మునిగి శోకం మిగిలె.. | Remains immersed in hopes of grief .. | Sakshi
Sakshi News home page

ఆశలు మునిగి శోకం మిగిలె..

Published Mon, Sep 16 2013 2:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM

Remains immersed in hopes of grief ..

నీట మునిగి ఆరుగురు పిల్లలు మృత్యువాత పడడంతో జిల్లాలో విషాదం అలుముకుంది. కన్నవారికి కడుపుకోత మిగిలింది. ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్న పిల్లలు సాయంత్రానికి లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక ఆ తల్లిదండ్రులు విలపిస్తుంటే ఆ పల్లెలన్నీ శోకసంద్రమయ్యాయి. గుర్రంకొండ మండలం మర్రిమాకులపల్లెలో వినాయక నిమజ్జనం అనంతరం ఒంటిపై ఉన్న రంగులను కడుక్కునేందుకు చెరువులో దిగి లోకేశ్వర్ రెడ్డి (13), బాలాజీ రెడ్డి (13) నీట మునిగి చనిపోయారు.

బి.కొత్తకోట మండలంలో టేకులపెంటలో ఆడుకుంటూ నీటిలో దిగి  వెంకటేష్(7), ప్రదీప్ (6) దుర్మరణం పాలయ్యారు. వీరిద్దరూ అన్నాదమ్ములు.  తంబళ్లపల్లె మండలం ఇట్నేనివారిపల్లె యానాదికాలనీకి చెందిన హరీష్‌బాబు(12) ఈత కోసం చెరువులో దిగి మృతి చెందాడు. వడమాలపేట మండలం కాయం ఎస్టీ కాలనీలో  హేమంత్‌కుమార్(6)  తోటి పిల్లలతో కలసి సమీపంలోని నీటిగుంటలో దిగాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. తోటి పిల్లలు బయటకు తీశారు. అప్పటికే చనిపోయాడు.     
 
గుర్రంకొండ, న్యూస్‌లైన్: వినాయుకుడి నివుజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. చెరువులో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన గుర్రంకొండ వుండలం వుర్రివూకులపల్లెలో ఆదివారం రాత్రి జరిగింది. సాయుంత్రం నిమజ్జనం కార్యక్రవుం ప్రారంభం కాగా గ్రావూనికి చెందిన పీ.చిన్నవుస్తాన్‌రెడ్డి కువూరుడు పీ.లోకేశ్వర్‌రెడ్డి(13), పీ.సురేందర్‌రెడ్డి కువూరుడు పీ.బాలాజిరెడ్డి(13)తో పాటు గ్రావూనికి చెందిన లోకేష్‌రెడ్డి చెరువు వద్దకు వుుదుగానే చేరుకున్నారు.

ఒంటి పై ఉన్న రంగులను కడుక్కునేందుకు ముగ్గురూ ఒకేసారి చెరువులోకి ఈత కోసం దిగారు. వీరిలో లోకేశ్వర్‌రెడ్డి, బాలాజిరెడ్డి చెరువు పూడికలో చిక్కుకుపోయారు. లోకేష్‌రెడ్డి గట్టుకు చేరుకుని గ్రావుంలో కి పరుగులు తీశాడు. విషయం చెప్పడంతో గ్రామస్తులు కొందరు చెరువులోకి దిగి వారిద్దరినీ బయుటకు తీశారు. అప్పటికే ఇద్దరు చనిపోయూరు. ఈ ఇద్దరు విద్యార్థులు గుర్రంకొండలోని విశ్వభారతి హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నారు. మృతితుల్లో బాలాజిరెడ్డి ఒక్కరే వుగ సంతానం కావడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. విషయుం తెలుసుకున్న ఎస్‌ఐ చలపతి సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తుచేశారు.

కుంటలోదిగి ఇద్దరు చిన్నారుల మృతి : బి.కొత్తకోట:  మండలంలోని అటవీ ప్రాంతం టేకులపెంటలో ఆదివారం సాయంత్రం ఇద్దరు చిన్నారులు నీట మునిగి చనిపోయారు. అదృష్టవశాత్తు నలుగురు పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. బి.కొత్తకోట మండలం గట్టు గ్రామంలోని టేకులపెంటకు చెందిన బీ.వీరమ్మకు కురబలకోట మండలం చింతమాకులపల్లెకు చెందిన పెద్దిరాజుతో వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం.

పెద్దిరాజు నాలుగేళ్ల క్రితమే మృతి చెందాడు. ముగ్గురు పిల్లలతో వీరమ్మ చింతమాకులపల్లెలో ఉంటోంది. వీరమ్మ రెండు రోజుల క్రితం పిల్లలతో కలసి టేకులపెంటకు వచ్చింది. ఆదివారం సాయంత్రం వీరమ్మ పిల్లలు వెంకటేష్(7), ప్రదీప్(6), స్థానికులైన అంజనమ్మ, గౌతమి, అనంత, శివకుమార్ (వీరికి 3-5 సంవత్సరాల వయస్సు) కలిసి టేకులపెంటకు సమీపంలోని గుండాలకుంటలో నీళ్లలో దిగారు. వీరిలో వెంకటేష్, ప్రదీప్ నీటిలో మునిగిపోయారు.

గౌతమి బురదలో చిక్కుకుపోయింది. శివకుమార్, అనంతలు నీటిలో మునిగిపోతూ కేకలు పెట్టారు. ఇదే సమయంలో స్థానికురాలైన రమణమ్మ అటువైపుగా వెళుతూ కేకలు విని కుంట వద్దకు చేరుకుంది. వెంటనే వెంకటరమణ అనే వ్యక్తికి విషయం చెప్పడంతో అతను కుంటలో దిగి పిల్లలందరినీ ఒడ్డుకు తీసుకొచ్చాడు. అప్పటికే వెంకటేష్, ప్రదీప్ మృతి చెందారు.

 ప్రాణం తీసిన ఈత సరదా

 తంబళ్లపల్లె : ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం బలిగొంది.  తంబళ్లపల్లె సమీపంలోని ఇట్నేనివారిపల్లె యానాదికాలనీకి చెందిన టేకుమంద మల్లయ్య, మల్లీశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. హరీష్‌బాబు(12) ఎనిమిదో తరగతి, శ్రీహరి మూడవ తరగతి చదువుతున్నారు. వీరు ఈత కొట్టేందుకు గ్రామ సమీపంలోని అక్కమ్మచెరువు వద్దకు వెళ్లారు. ముందుగా హరిబాబు చెరువులోకి దిగాడు. ఎక్కువలోతు ఉండడంతో మునిగిపోయాడు. గమనించిన శ్రీహరి పరుగున వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. వెంటనే గ్రామస్తులు అక్కడకు చేరుకుని చెరువులో గాలించారు. చివరకు హరిబాబు మృతదేహాన్ని వెలికి తీశారు. గ్రామ సర్పంచ్ గీతారెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఎం.కొండ్రెడ్డి సాయివిద్యామందిర్ కరస్పాండెంట్ కమలమ్మ తదితరులు బాలుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 నీట మునిగి బాలుడి మృతి

 వడమాలపేట: తోటి పిల్లలతో కలసి నీటిగుంటలో దిగిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. వడమాలపేట మండలం కాయం ఎస్టీ కాలనీకి చెందిన సుబ్రమణ్యం, కల్పన  కొడుకు హేమంత్‌కుమార్(6)  తోటి పిల్లలతో కలసి సమీపంలోని నీటిగుంటలో దిగాడు. లోతైన ప్రదేశంలోకి వెళ్లడంతో ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. వెంటనే తోటిపిల్లలు గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పడంతో గ్రామస్తులు వెళ్లి హేమంత్‌కుమార్‌ను బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement