- ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవాల సం దర్భంగా ఉగ్రవాదులు విధ్వంసానికి పాల్పడే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. రిపబ్లిక్‌డేకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు ఒబామా విచ్చేస్తున్న నేపథ్యంలో దేశ రాజధానితోపాటు పలు రాష్ట్రాల్లో విధ్వంసాలకు విదేశీ, దేశీయ ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయని తన నివేదికలో ఐబీ పేర్కొన్నట్లు తెలిసింది. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు కొచ్చి, చెన్నైల్లో విధ్వంసాలకు ఉగ్రవాదులు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ డీజీపీ అన్ని జిల్లాల ఎస్‌పీలు, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేశారు.