తిరగబడితే కాల్చివేత | Reversal burning | Sakshi
Sakshi News home page

తిరగబడితే కాల్చివేత

Published Sat, Dec 21 2013 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

Reversal burning

రాజంపేట, న్యూస్‌లైన్: ఎర్రచందనం స్మగర్లు తిరగబడితే కాల్చివేయనున్నారు. ఈ మేరకు అటవీ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు  జారీ చేశారు. శేషాచలం అటవీ ప్రాంతంలో తుంబురతీర్ధం వద్ద అటవీ అధికారులను  ఇటీవల దారుణంగా హత్య చేసిన ఎర్రదొంగలను వేటాడేందుకు సాయుధబలగాలు రంగంలోకి దిగాయి.
 
 శనివారం నుంచి ఆపరేషన్ ప్రారంభించనున్నారు.  ఆరు ప్లటూన్ల  
 సాయుధబలగాలు రాజంపేట డివిజన్ ఫారెస్ట్ కార్యాలయానికి చేరుకున్నాయి.  ఏపీఎస్‌పీ బెటాలియన్ ఎస్‌ఐ రాంబాబు ఆధ్వర్యంలో శేషాచలంలో గాలింపు చేసేందుకు అటవీ అధికారులతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అటవీ సిబ్బంది, సాయుధబలగాలు సమైక్యంగా అడవిలోకి అడుగు పెట్టనున్నారు.  మొత్తం మీద శేషాచల అటవీ ప్రాంతాలు  సాయుధబలగాల కనురెప్పల్లో ఉండే పరిస్థితులు  నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement