నగరంలో కార్ల దొంగతనాలను పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి రెండు కార్లు, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొత్తు విలువ రూ.11.15 లక్షలు ఉంటుందని తెలిపారు. వీరు నగరంలో నాలుగు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ రివార్డులు ప్రకటించారు.