car thief
-
పార్కింగ్ చేసిన కారునే చోరీ చేస్తున్నాడు
-
పోలీసులకు చిక్కకుండా గర్ల్‌ఫ్రెండ్ టెడ్డీబేర్‌లో దాక్కున్న దొంగ.. చివరికి
కొత్తగా ఏదైనా షాప్ ఓపెన్ అయినప్పుడు.. కార్టూన్ క్యారెక్టర్స్ వేషంలో ప్రమోషన్స్ చేయడం చూస్తూనే ఉంటాం. కానీ.. టెడ్డీబేర్‌ను మరీ కొత్తగా వాడాడు మాంచెస్టర్‌కు చెందిన ఓ యువకుడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికి టెడ్డీబేర్‌లో దాక్కున్నాడు. అసలేం దొంగతనం చేశాడు? అలా ఎలా దాక్కున్నాడంటే? 18 ఏళ్ల జాషువా డాబ్సన్ చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవల ఓ కారును దొంగిలించాడు. దాంట్లో ఫ్యూయల్ పోసుకుని బంక్‌లో డబ్బులు కట్టకుండా వెళ్లిపోయాడు. దీంతో అతనిమీద మరో రెండు కేసులు నమోదయ్యాయి. పోలీసులు తనకోసం వెతుకుతుండటంతో భయపడ్డ డాబ్సన్ దాక్కోవడానికి గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న ఐదు అడుగుల టెడ్డీబేర్‌ను కట్‌చేసి, అందులో కొంత స్టఫ్ తీసేసి, మనోడు అందులో కూర్చున్నాడు. పోలీసులు చివరకు డాబ్సన్ గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వచ్చి వెదకడం మొదలుపెట్టారు. టెడ్డీబేర్ శ్వాస తీసుకుంటున్న చప్పుడు రావడంతో అనుమానం వచ్చి దాన్ని కట్ చేసి చూశారు. ఇంకేముంది... అందులోంచి డాబ్సన్ బయటికొచ్చాడు. కార్ల దొంగతనంతోపాటు, అతనిపై రెండుమూడు పెటీ కేసులు కూడా ఉండటంతో డాబ్సన్కు కోర్టు తొమ్మిదినెలల జైలు శిక్ష విధించింది. అలాగే డ్రైవింగ్ చేయకుండా అతనిపై 27 నెలలపాటు నిషేధించింది. మాంచెస్టర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ వార్త వైరల్ అవుతూ నెటిజన్స్‌కు నవ్వులు పంచుతోంది. ‘సూపర్ క్రియేటివిటీ’, ‘పా పెట్రోల్’, ‘‘అన్ ‘బేర’బుల్’’, ‘టెడ్డీబేర్‌ను ఇలా కూడా వాడుకోవచ్చా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: ఇదేం పెళ్లి.. భార్యకాని భార్యతో కలసి పోజులిచ్చి -
10 రాష్ట్రాల్లో 61 కేసులు.. ‘దమ్ముంటే నన్ను పట్టుకోండి’
సాక్షి,హైదరాబాద్: అతడి పేరు సత్యేంద్ర సింగ్ షెకావత్...రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఆర్మీ మాజీ జవాను కుమారుడు...ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ పూర్తి చేశాడు...కేవలం హైఎండ్ కార్లనే టార్గెట్‌గా చేసుకుని 2003 నుంచి చోరీలు చేస్తున్నాడు...ఇప్పటి వరకు 10 రాష్ట్రాల్లో 61 నేరాలు చేసిన ఇతడిపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లోనూ ఐదు కేసులు ఉన్నాయి. షెకావత్‌ను ఈ ఏడాది మార్చిలో బెంగళూరులోని అమృతహల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని శుక్రవారం పీటీ వారెంట్‌పై తమ కస్టడీలోకి తీసుకున్న బంజారాహిల్స్ అధికారులు విచారిస్తున్నారు. ► మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న పంచవటి పోలీసుస్టేషన్ పరిధి నుంచి 2003లో క్వాలిస్‌ను చోరీ చేయడంతో సత్యేంద్ర సింగ్ నేరచరిత్ర మొదలైంది. ప్రస్తుతం ఆడి, బీఎండబ్ల్యూ, స్కార్పియో వంటి అత్యంత ఖరీదైన కార్లను మాత్రమే టార్గెట్ చేసే షెకావత్ వాటిని చోరీ చేయడంలోనూ ప్రత్యేకత చూపిస్తుంటాడు. ► కార్ల తాళాలు స్కాన్ చేయడానికి, వాహనం నంబర్ ఇతర వివరాల ఆధారంగా జీపీఎస్ ద్వారా దాని ఉనికి కనిపెట్టడానికి, మారు తాళాలు త యారు చేయడానికి అవసరమైన ఉపకరణాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఓ కారు ఇంజిన్ నంబర్, ఛాసిస్ నెంబర్ ఆధారంగా దాని తాళం తయారు చేయడం ఇతడికే సొంతం. ► ఇటీవల కాలంలో తాళం పెట్టాల్సిన అవసరం లేకుండా, అది దగ్గర ఉంటే చాలు స్టార్ట్ అయ్యే వాహనాలు వచ్చాయి. ఇలాంటి వాటిని చోరీ చేయడానికి షెకావత్ చైనా నుంచి ఖరీదు చేసిన ఎక్స్‌టూల్ ఎక్స్–100 ప్యాడ్ అనే పరికరం వాడతాడు. సదరు వాహనం ఆగిన వెంటనే డ్రైవర్ కిందికి దిగకుండానే దాని సమీపంలోకి వెళ్తాడు చదవండి: అయ్యా బాబోయ్! అతనికి 50, ఆమెకు 23.. ఏజ్ గ్యాప్ ఉన్నా పర్లేదంటూ.. ► డొంగల్తో కనెక్ట్ చేసి ఉండే ఎక్స్‌టూల్ ఎక్స్–100 ప్యాడ్ ద్వారా దాని ఫ్రీక్వెన్సీ రికార్డు చేస్తాడు. ఆ ఫ్రీక్వెన్సిని తన వద్ద ఉండే వీవీడీఐ మినీ కీటూల్ ద్వారా నకిలీ తాళంలోకి ఇన్‌స్టల్ చేస్తాడు. ఇలా తయారైన తాళం తన వద్ద ఉంచుకుని దర్జాగా కారుతో ఉడాయిస్తాడు. 2003 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంతో పాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, డయ్యూడామన్, ఉత్తరప్రదేశ్‌ల్లో 58 వాహనాలు తస్కరించాడు. వీటితో పాటు రెండు దోపిడీ, ఓ ఆయుధ చట్టం కేసులు సత్యేంద్ర సింగ్‌పై ఉన్నాయి. ► బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ స్టార్ హోటల్లో గతేడాది జనవరి 26న పంజా విసిరిన షెకావత్ దాని పార్కింగ్ లాట్ నుంచి కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ వి.మంజునాథ్ కారు తస్కరించాడు. అప్పట్లోనే నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఏప్రిల్‌లో నాచారంలో అడుగుపెట్టిన సత్యేంద్ర సింగ్ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాహనం తస్కరించాడు. దీంతో ఆ పోలీసులు జైపూర్ వరకు వెళ్లారు. చోరీల్లో షెకావత్ భార్యకు పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఆమెను అరెస్టు చేసినప్పటికీ... పీటీ వారెంట్ ఇవ్వడానికి నిరాకరించిన అక్కడి కోర్టు అమెకు బెయిల్ ఇచ్చింది. ఆ సందర్భంలో పోలీసులతో వీడియో కాల్లో మాట్లాడిన షెకావత్ ‘దమ్ముంటే నన్ను పట్టుకోండి. నా భార్యను, కుటుంబాన్ని వేధించొద్దు’ అంటూ సవాల్ విసిరాడు. దీంతో అతడి కోసం అతడి కోసం గాలింపు ముమ్మరమైంది. ఈలోగా మరో మూడుసార్లు ఇక్కడకు వచ్చి వెళ్లిన షెకావత్ పేట్‌బషీరాబాద్, దుండిగల్ల్లో మూడు కార్లు ఎత్తుకుపోయాడు. ఎట్టకేలకు బెంగళూరు పోలీసులకు చిక్కాడు. ఇతడిని పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చిన బంజారాహిల్స్ పోలీసులు కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు విచారించనున్న ఈ అధికారులు చోరీ అయిన కారు రికవరీ చేయనున్నారు. షెకావత్ చోరీ చేసిన కార్లను విక్రయించి సొమ్ము చేసుకుంటాడని, ఆ సొమ్ముతో జల్సాలు చేస్తాడని పోలీసులు చెప్తున్నారు. -
చేజారిన కార్ల దొంగ!
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 కార్లను లీజు పేరిట తీసుకున్న ఒక ఘరానా దొంగ వాటిని తాకట్టు పెట్టేశాడు. దీంతో బాధితులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కార్ల కేసులకు సంబంధించి ఇప్పటికే ఎంవీపీ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసుని కూడా టేకప్ చేసింది. కానీ నిందితుడిని రెండుసార్లు విచారణకు పిలిచిన పోలీసులు అరెస్టు చేయకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. ఫలితంగా సదరు నిందితుడు కొద్దిరోజులుగా పరారీలో ఉంటూ, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పోలీసులకు ఏం చేయాలో తోచని అయోమయ దుస్థితి నెలకొంది. వివరాలిలా వున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన అడపా ప్రసాద్ (28) ఆరిలోవ టీఐసీ పాయింట్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇతను సెవెన్‌హిల్స్ ఆస్పత్రి దరి రాక్‌డేల్ లే అవుట్ ప్రాంతంలో 369 కేబ్స్ పేరిట ట్రావెల్స్ నడుపుతున్నాడు. కొందరు కార్ల యజమానులు, ట్రావెల్స్ నుంచి 200 వరకు కార్లు లీజుకి తీసుకున్నాడు. మొదట్లో ఐదు నెలల వరకు లీజు మొత్తం చెల్లించాడు. తరువాత అద్దె చెల్లించకపోవడంతో బాధితులు ఎంవీపీ, త్రీటౌన్, ఆరిలోవ, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లలో గత ఏడాది డిసెంబర్లో ఫిర్యాదు చేశారు. కొంప ముంచిన అరెస్టులో జాప్యం నిందితుడిని రెండుసార్లు విచారణకు పిలిపించిన ఎంవీపీ సిట్ పోలీసులు అతన్ని ఎందుకు అరెస్టు చేయలేదన్నది ప్రశ్నగా మారింది. మద్దిలపాలెం భానునగర్కి చెందిన బల్లా గౌరి, శ్రీహరిపురం ప్రాంతాలకు చెందిన ఎస్.సునీల్‌కుమార్ ఎంవీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు ప్రసాద్‌ని విచారించిన ఎంవీపీ పోలీసులు అతన్ని అరెస్టు చేయకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొద్దిరోజులుగా నిందితుడు పరారీలో ఉన్నాడు. పైగా అతని మొబైల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఎంవీపీ సిట్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఎంఆర్పేట ఎస్ఐ గణపతి, ఎంవీపీ ఎస్ఐ సూర్యనారాయణ సిట్ కింద ఈ కార్ల కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు ఈ సందర్భంగా ఎంవీపీ స్టేషన్ ఎస్ఐ సూర్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ నిందితుడు అడపా ప్రసాద్ కోసం గాలిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 71 కార్లు రికవరీ చేశామన్నారు. మిగిలిన కార్ల కోసం గాలిస్తున్నామన్నారు. గతంలో సిట్ పోలీసులు ఒడిశాకి చెందిన ఒక కార్ల దొంగను అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించిన సంగతి తెలిసిందే. ఇతను కూడా యజమానుల నుంచి తీసుకున్న కార్లను అనపర్తి, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఫైనాన్సియర్లకు తాకట్టు పెట్టేశాడు. ట్రావెల్స్ యజమానులు కార్లు అద్దె లేదా లీజుకి ఇచ్చేముందు తగు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అద్దెలు చెల్లించలేక తాకట్టు కార్లు లీజుకి తీసుకున్న అడపా ప్రసాద్ బేరాలు లేని కారణంగా కొన్నాళ్లుగా అద్దెలు చెల్లించలేకపోయాడు. అయితే నిబంధనల ప్రకారం కార్ల యజమానులకు అద్దె విధిగా చెల్లించాల్సి ఉంది. పలువురు కార్ల యజమానులు డబ్బు కోసం ప్రసాద్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రసాద్ ఈ కార్లను తన స్నేహితులు శ్రీనివాస్, సుదర్శన్ ద్వారా అనకాపల్లి, అనపర్తి, రాజమండ్రి, కాకినాడ, జగ్గంపేట ప్రాంతాలకు చెందిన ఫైనాన్సియర్లకు తాకట్టు పెట్టేశాడు. కార్ల ఖరీదు ఆధారంగా రూ.3 లక్షల నుంచి రూ.7లక్షల వరకు తాకట్టు పెట్టాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సిట్ పోలీసులు ఇప్పటి వరకు 71 కార్లు రికవరీ చేశారు. -
అంతర్రాష్ట్ర కార్ల దొంగల ముఠా అరెస్టు
చిత్తూరు అర్బన్: తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో కార్లను చోరీ చేసే అంతర్రాష్ట్ర ముఠాను పలమనేరు బైపాస్ రోడ్డులోని దండపల్లె క్రాస్ వద్ద శుక్రవారం అరెస్టు చేసినట్టు ఎస్పీ విక్రాంత్‌పాటిల్ తెలిపారు. ఆయన చిత్తూరు నగరంలోని పోలీస్ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. వరుస కార్ల చోరీల నేపథ్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గంగవరం, పలమనేరు బైపాస్, దండపల్లె క్రాస్‌ల్లో తనిఖీలు చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలో కుప్పం నుంచి పలమనేరు వైపు వరుసగా ఏడు కార్లు వస్తుండగా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారని తెలిపారు. కార్లను డ్రైవర్లు వదిలి పరారయ్యారని పేర్కొన్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వేలూరు జిల్లా కాట్పాడికి చెందిన దినేశ్‌కుమార్ (32)ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ఏడు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. పరారైన దొంగలు ఆరుగురు తమిళనాడు వాసులని విచారణలో తేలిందన్నారు. వేర్వేరు ప్రాంతాల్లో కార్ల చోరీ దుండగులు ఆగస్టులో వరదయ్యపాళ్యం, శ్రీకాళహస్తి ప్రాంతంలో మూడు ఇన్నోవా కార్లు, సెప్టెంబర్‌లో విజయవాడలో మారుతి స్విఫ్ట్ కార్లు, బెంగళూరులో ఒక కారును చోరీ చేశారని ఎస్పీ తెలిపారు. వాటి విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందన్నారు. దినేశ్‌కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు ముఠా నాయకుడు మదురైకి చెందిన పరమేశ్వరన్‌ను అక్టోబర్ 16న వి.కోటలో అరెస్టు చేసినట్లు తెలిపారు. పరమేశ్వరన్ భార్య విజయలక్ష్మీ, దినేశ్‌కుమార్, దేవ పథకం ప్రకారం కార్లను చోరీ చేసి చెన్నై కొరత్తూరులోని సెకండ్ హ్యాండ్ షోరూమ్‌లో విక్రయిస్తున్నారని వివరించారు. ఆర్సీ నెంబర్లు, చాయిస్ నంబర్లను కూడా మార్చి చోరీ చేసిన కార్లను సులువుగా విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ద్విచక్ర వాహనానికి ఉండాల్సిన నంబర్లు కార్లకు, కార్లకు ఉండాల్సిన నంబర్లు ద్విచక్ర వాహనాలకు ఉన్నట్లు పేర్కొన్నారు. త్వరలో పరారైన మిగతా ఆరుగురు నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. అనంతరం ముఠాను పట్టుకోవడానికి అధికారులతో పాటు కృషి చేసిన పలమనేరు క్రైమ్ పార్టీ హెడ్‌కానిస్టేబుల్ దేవరాజులురెడ్డి, శ్రీనివాసులునాయుడు, గజేంద్ర, జయకృష్ణ, కానిస్టేబుళ్లు ప్రకాశ్‌నాయుడు, సతీశ్, జ్ఞానప్రకాశ్, అల్లావుద్దీన్, వెంకటేశ్, గౌస్, ఎల్లప్ప, విశ్వనాథ్, సురేష్, హెచ్‌జీ శివ, లోకనాథ్ లను ఎస్పీ అభినందించారు. -
ఢిల్లీలో ఎన్కౌంటర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఓ కారు దొంగ పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఈఘటన ఢిల్లీ నగర శివారులోని కన్జవ్లాలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నుంచి ఒక మారుతి హోండాకారును దొంగిలిస్తూ పారిపోతున్న కొందరు పోలీసుల కంటపడ్డారు. సినీఫక్కీలో వెంబడిస్తున్న పోలీసులపై వారు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఆత్మరక్షణ కోసం తిరిగి కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఒక దుండగుడు మరణించాడు. మిగతావారు పారిపోయారు. బుల్లెట్ గాయంతో పడిఉన్న అభిషేక్ అనే మరో వ్యక్తిని సావిత్రి ఆస్పత్రి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
ఏసీలో పడుకోవాలని.. కారులో తిరగాలని..
ఏసీ గదిలో పడుకోవాలని అతడికి కల.. కానీ ఇంట్లో ఏసీ లేదు. మంచి పడవలాంటి పెద్ద కారులో షికారుకు వెళ్లాలని ఆశ.. కానీ కొనేంత స్థోమత లేదు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టడంతో ఢిల్లీకి చెందిన అమృత్ సింగ్ (19) తన కలలు నెరవేర్చుకోలేకపోయాడు. ఎలాగైనా వాటిని అనుభవించాలని మొదట్లో కారు బ్యాటరీలు, ఇతర విడి భాగాలు చోరీ చేయడం మొదలుపెట్టాడు. చివరకు ఏకంగా ఓ హోండా సిటీ కారు కొట్టేశాడు. తనను తాను 'డాన్' అని పిలుచుకునే అమృత్ సింగ్ తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో కారు దొంగతనం చేస్తుండగా సీసీటీవీ ఫుటేజిలో దొరికిపోయాడు. దాంతో పోలీసులు సదరు 'సరదా' దొంగను అరెస్టు చేశారు. రాత్రిపూట విలాసవంతమైన కారులో తిరగాలన్న తన సరదా తీర్చుకోడానికే కారు చోరీచేసినట్లు తర్వాత పోలీసు విచారణలో అతడు తెలిపాడు. అతడి వద్ద ఆరు కార్లతో పాటు ఒక స్కూటర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐదో తరగతి వరకు బాగా తెలివైన విద్యార్థిగా ఉండే అమృత్.. ఆ తర్వాత చెడు స్నేహాలతో పాడైపోయాడు. ఖరీదైన కార్లు నడపాలంటే అతడికి సరదా అని, కానీ తమ ఇంట్లోకి 5 రూపాయలు పెట్టి వాషింగ్ పౌడర్ కొనమన్నా ఇబ్బందిపెట్టేవాడని అతడి తల్లి హర్జీందర్ కౌర్ చెప్పారు. చోరీచేసిన స్కూటర్లు అమ్మితే వచ్చిన డబ్బుతో కారులోకి పెట్రోలు పోయించేవాడు. ఏదైనా కారు మీద అతడికి విసుగు పుడితే, దాన్ని పక్కన పడేసి మరో కారు చోరీచేసేవాడని డీసీసీ రిషిపాల్ తెలిపారు. రాత్రంతా ఏసీ వేసుకుని కారులోనే పడుకునేవాడని.. అలా ఏసీ సరదా, కారు సరదా రెండూ తీర్చుకునేవాడని చెప్పారు. అతడి పేరు మీద ఇప్పటివరకు 16 చోరీ కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి. -
నెల్లూరులో ఘరానా దొంగల అరెస్ట్
నగరంలో కార్ల దొంగతనాలను పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి రెండు కార్లు, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగిలించిన సొత్తు విలువ రూ.11.15 లక్షలు ఉంటుందని తెలిపారు. వీరు నగరంలో నాలుగు చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ రివార్డులు ప్రకటించారు. -
జూబ్లీహిల్స్‌లో కార్లు దొంగలిస్తున్న వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో పలు హోటళ్లలో పార్క్ చేసిన ఖరీదైన కార్లను దొంగలిస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థి సుమన్ జల్సాలకు బాగా అలవాటు పడ్డాడు. ఆ క్రమంలో పెద్ద పెద్ద హోటళ్లల్లో పార్క్ చేసిన కార్లను చోరీ చేయడమే లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ క్రమంలో జూబ్లీహిల్స్‌లో ప్రముఖ హోటల్లో పార్క్ చేసిన కారు చోరీకి గురైంది. దాంతో ఆ వాహనం యజమాని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఈ రోజు ఓ కారు చోరీకి యత్నించి... పోలీసులకు చిక్కాడు. -
కటకటాలపాలైన కార్లదొంగ
సాక్షి, న్యూఢిల్లీ: కార్ల తాళాలను స్మార్టుగా తీసి వాటిని కాజేస్తున్న ఓ దొంగను అరెస్టు చేయడంతోపాటు ఓ కారును స్వాధీనం చేసుకున్నారు క్రైం బ్రాంచి పోలీసులు. భేషరమ్ సిమాలోమాదిరిగా ఏకారుకు అవతలి వ్యక్తి నుంచి డిమాండ్ ఉంటే ఆ కారును ఎంపిక చేసుకుని మరీ వాటినే కాజేస్తున్నట్టు క్రైం బ్రాంచ్అదనపు కమిషనర్ రవిందర్‌యాదవ్ తెలిపారు. పోలీసులు పేర్కొన్న ప్రకారం.. యూపీలోని మీరట్ జిల్లా శ్యామ్నగర్కి చెందిన మెహతాబ్ అనే వ్యక్తి కార్లు దొంగిలించి ఇతర రాష్ట్రాలకు వాటిని తరలిస్తున్నట్టు క్రైం బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఈ కేసుపై దృష్టి సారించారు. నిందితుడు ఇటీవల చోరీ చేసిన ఓ కారును హైదర్పురాలోని మ్యాక్స్ ఆసుపత్రి సమీపంలో విక్రయించేందు వస్తున్నట్టు స్థానిక వేగుల ద్వారా తెలుసుకున్నారు. అక్కడే మాటువేసి ఉన్నపోలీసులు నిందితుణ్ని మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. జావెద్ అనే మరో వ్యక్తితో కలిసి తాను కార్లు చోరీ చేస్తున్నట్టు మెహతాబ్ తెలిపాడు. ఎలక్ట్రానిక్ తాళాలను పగులగొట్టడంతో వీరిద్దరూ ఆరితేరారు. ముందుగా ఎంపిక చేసుకున్న కారు తాళాలను తెరచి తాపీగా అక్కడి నుంచి జారుకుం టారు. ఎదుటివారు సైతం గుర్తించలేనంతలా వీరు ప్రవర్తింస్తారని పోలీసులు పేర్కొన్నారు. మొత్తం మూడు చోరీ కేసులు పరిష్కారం అయినట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఓ టయోటా క్వాలిస్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. జావెద్‌ను అరెస్టు చేయడంతోపాటు మిగిలిన కార్లను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని ఏసీపీ ధీమా వ్యక్తం చేశారు.