జూబ్లీహిల్స్లో కార్లు దొంగలిస్తున్న వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో పలు హోటళ్లలో పార్క్ చేసిన ఖరీదైన కార్లను దొంగలిస్తున్న వ్యక్తిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్కు తరలించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థి సుమన్ జల్సాలకు బాగా అలవాటు పడ్డాడు.
ఆ క్రమంలో పెద్ద పెద్ద హోటళ్లల్లో పార్క్ చేసిన కార్లను చోరీ చేయడమే లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ క్రమంలో జూబ్లీహిల్స్లో ప్రముఖ హోటల్లో పార్క్ చేసిన కారు చోరీకి గురైంది. దాంతో ఆ వాహనం యజమాని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఈ రోజు ఓ కారు చోరీకి యత్నించి... పోలీసులకు చిక్కాడు.