నెల్లూరు: నెల్లూరు నగరంలోని ఓ ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది. స్థానిక చంద్రమౌళి నగర్ 9వ వీధిలో ఉంటున్నమోహన్‌కుమార్ వొడాఫోన్ కంపెనీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. ఆయన ఆదివారం డ్యూటీకి వెళ్లగా కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లారు. ఇదే అదనుగా తలుపులు బద్దలు కొట్టి, ఇంట్లోకి చొరబడిన దుండగులు బీరువా పగలకొట్టి 3 సవర్ల బంగారు, 200 గ్రాముల వెండి ఆభరణాలను ఎత్తుకు పోయారు.
సోమవారం ఉదయం పొరుగింటి వారు గమనించి, తలుపులు బద్దలు కొట్టి ఉన్న విషయాన్ని ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఆయన ఇంటికి చేరుకుని చోరీ ఘటనపై 5వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.