ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దొంగలు కలకలం సృష్టించారు. జిల్లాలోని ఒంగోలు పట్టణంలోని మంగళవారం రాత్రి చంద్రయ్యకాలనీ, గద్దలకుంట కాలనీలలో చొరబడ్డ దొంగలు రెచ్చిపోయారు. వరుసగా రెండు ఇళ్లల్లో చోరీకి పాల్పడి రూ.50 వేల నగదు, 20 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. అదేవిధంగా జక్రయ్య హాస్పిటల్ సెంటర్, పెళ్లూరు, ఏడుగుండ్లపాడు, హౌస్‌బోర్డు కాలనీల్లో ఇళ్లలోకి ప్రవేశించి బలవంతంగా మహిళల మంగళసూత్రాలను లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చైన్ స్నాచింగ్ లో దాదాపు 10 సవర్ల బంగారం అపహరించుపోయినట్టు సమాచారం.