ముప్పాళ్ల (గుంటూరు): గుంటూరు జిల్లా ముప్పాళ్లలోని రాముల వారి గుడిలో చోరీ జరిగింది. శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయం తలుపులు ధ్వంసం చేసి స్వామివారి వెండి ఆభరణాలతో పాటు, హుండీని ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయ సమీపంలోని రెండు కిరాణా దుకాణాలలో కూడా చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.