భోజనాన్ని తనిఖీ చేస్తున్న ఎంపీడీఓ
సాక్షి, ఆలూరు (ప్రకాశం):‘ఈ పాడు భోజనం మాకొద్దు, మురిగిపోయిన గుడ్లు అలసలే వద్దు, తిరిగి తీసుకెళ్లండి’ అని ఆలూరు పాఠశాల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. భోజనం సక్రమంగా లేదని, కూరలు రుచిగా లేవని, వండిన గుడ్లు దుర్వాస వస్తున్నాయంటూ విద్యార్థులు ఆహారాన్ని కింద పడేయడం పరిపాటిగా మారింది. మంగళవారం ఎంపీడీఓ పి.సుజాత బూత్‌ల పరిశీలన కోసం వచ్చిన సందర్భంగా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో మధ్యాహ్నం భోజనం వచ్చింది.
ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ భోజనం బాగులేదని, చెడిపోయిన గుడ్లు పంపిస్తున్నారని, కూర రుచికరంగా లేదని కాంట్రాక్టరుకు ఇచ్చినప్పటి నుంచి ఇదే విధంగా కొనసాగుతోందని ఎంపీడీఓ దృష్టికి తీసికెళ్లారు. నాశిరకం భోజనం వండిపెడుతున్నారని, తాజా భోజనం వండిపెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై నివేదిక తయారుచేసి జిల్లా అధికారుల దృష్టికి తీసికెళ్లతానని చెప్పారు. అనంతరం ఆలూరులో పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. పోలింగ్ బూత్‌లో విద్యుత్ ఉందా, ర్యాంపులు, తాగునీరు, మరుగుదొడ్లు ఉన్నాయా? లేదా? అని పరిశీలించారు. లేని వాటికి వెంటనే వేయించాలని ఆయా హెచ్‌ఎంలను ఆదేశింశారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్‌ఎం ఎల్‌వీఎన్ రమేష్, తోట రంగారావు, దొడ్ల రాజుగోపాల్‌రెడ్డి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment