కోటబొమ్మాళి, న్యూస్‌లైన్: నిమ్మాడ కూడలి వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రం వద్ద ఎస్‌ఐ జి.నారాయణస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది శనివారం తనిఖీలు జరిపి 6 లక్షల నగదు పట్టుకున్నారు. టెక్కలి సమీపంలోని బొప్పాయిపురం వద్ద ఉన్న ఎన్‌ఆర్‌ఎల్ పెట్రోలు బంకుకు చెందిన గుమస్తా ప్రసాద్ పట్నాయక్ కారులో తీసుకువెళ్తుండగా నగదు పట్టుకున్నారు.
ఎన్‌ఆర్‌ఎల్ పెట్రోలు బంకు ఇటీవల బీపీసీఎల్ బంకుగా మారినందున దీనికి సంబంధించిన స్థలం పొందూరులో రిజిస్ట్రేషన్ కోసం అక్కడి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకువెళ్తున్నామని గుమస్తా చెప్పారు. అందు కు సంబంధించిన ఆధారాలను కొద్దిసేపటికి తీసుకువచ్చి చూపించారు. వీటిని పరిశీలించిన ఉప తహశీల్దార్ ప్రసాదరావు, ఎస్‌ఐ నారాయణస్వామి, ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు, ఆర్‌ఐ మురళి, వీఆర్‌వో పి.భూషణరావు ఆధారాల కాపీలను కలెక్టర్‌కు పంపించారు. అయితే ఆధారాలను వెంటబెట్టుకుని రానందున *6 లక్షల నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
వాహనాల తనిఖీల్లో *82 వేలు స్వాధీనం
పోలాకి: మండలంలో వనవిష్ణుపురం చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు నరసన్నపేటకి చెందిన తంగుడు నాగగౌరిశెట్టి నుంచి *82 వేలు స్వాధీనం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నాగగౌరిశెట్టి మోటారుసైకిల్‌పై *82 వేలతో వెళ్తూ పోలీసులకు పట్టుబ ట్టాడు. ఎటువంటి రశీదులు లేకుండా ఈ మొత్తా న్ని తీసుకువెళ్తుండడంతో ఎస్సై వి.సత్యనారాయణ, డిప్యూటీ తహశీల్దార్ జి.సత్యనారాయణ సమక్షంలో దాన్ని తహశీల్దార్ చంద్రకళకు అప్పగించారు. శెట్టి మాట్లాడుతూ తాను పిన్నింటిపేట, నిమ్మాడ గ్రామాల్లోని సిమెంట్ దుకాణాల వద్ద ఖాతాదారుల నుంచి సొమ్మును వసూలు చేసి ఇంటికి తీసుకు వెళ్తున్నట్టు తెలిపారు.
6 లక్షల నగదు పట్టివేత
Published Sun, Mar 23 2014 3:52 AM | Last Updated on Sun, Sep 2 2018 3:57 PM
Advertisement
Advertisement