
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం కర్నూలు జిల్లాలో నిర్వహించిని ధర్మపోరాట దీక్షకు ఒకరు బలైయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కర్నూల్లో జరుగుతున్న సీఎం సభకు టీడీపీ కార్యకర్తలు ప్రైవేట్ హహనంలో బయలు దేరారు. మార్గం మధ్యలో భోజనం చేయడానికి గార్గేయపురం గ్రామం చేరువు దగ్గర దిగారు.
భోజనం చేసి తిరిగి రోడ్డు దాటుతుండగా ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో టీడీపీ కార్యకర్త అయ్యస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చేరుకుచెర్ల గ్రామానికి చెందిన అయ్యస్వామిగా పోలీసులు గుర్తించారు.