సాక్షి, హైదరాబాద్: గ్రామీణప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాదిపాటు తప్పనిసరిగా వైద్య సేవలందించే డాక్టర్ల వేతనాలను పెంచుతూ సర్కారు బుధవారం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు పీజీ సూపర్ స్పెషలిస్టులకు రూ. 45 వేలు, పీజీ డిగ్రీ స్పెషలిస్టులకు రూ. 40 వేలు, పీజీ డిప్లొమా స్పెషలిస్టులకు రూ. 38 వేలు, డెంటిస్టులకు రూ.38 వేల చొప్పున వేతనాలు అందనున్నాయి. పెంచిన వేతనాలు గతేడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
మరోసారి 15 శాతం పెంపును 2017 జనవరి 1 నుంచి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులు ఏడాదిపాటు గ్రామీణ ఆసుపత్రుల్లో వైద్య సేవ లు అందించాలని సర్కారు నిబంధన విధించింది. దీనిని ఉపసంహరి ంచుకొని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జూడా లు గతేడాది సమ్మె కూడా చేశారు. సమ్మెపై హైకోర్టు ఇచ్చిన తీర్పులోనూ తప్పనిసరి వైద్యుల వేతనాల పెంపును పరిశీలించాలని సర్కారును ఆదేశించింది.
‘గ్రామీణ’ వైద్యుల వేతనాలు పెంపు
Published Thu, Mar 19 2015 3:11 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement