లక్సెట్టిపేట : నిత్యం మారుమూల గ్రామాల్లోని ప్రజలకు వైద్యసేవలు అందించే 104 సిబ్బంది వేతనానికి నోచుకోవడంలేదు. ఐదు నెలలుగా వేతనం అందక ఆర్థిక ఇబ్బం దులతో సతమతమవుతున్నారు. అసలే చాలీచాలని వేతనంతో కాలం వెళ్లదీస్తున్న తమకు ఆ మొత్తం కూడా నెలనెలా చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ కోసం అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణులకు సేవలు..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పేదల సౌకర్యార్థం 104 వైద్యసేవలు ప్రవేశపెట్టారు. మండలానికో ప్రత్యేక వాహనం, అందులో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు, ఫెలైట్, సెక్యూరిటీ గార్డు, సిబ్బంది ఉంటా రు. వీరు వివిధ గ్రామాలకు వెళ్లి బీపీ, షుగర్, అస్తమా తో బాధపడుతున్నవారితోపాటు గర్భిణులు, చిన్నారుల ను పరీక్షించి అవసరమైన మందులు పంపిణీ చేస్తుంటా రు. ఇందుకోసం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిన సి బ్బందిని నియమించారు. అయితే ఐదు నెలల నుంచి వే తనం అందక సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు సైతం చెల్లించలేక సతమతమవుతున్నారు. అధికారులకు సమస్య విన్నవించినా పట్టించుకోవడంలేదని సిబ్బంది పేర్కొంటున్నారు.
పట్టింపేది?
తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాక 104 సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని, వేతనమూ పెంచుతామని నాయకులు, అధికారులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. దీనికితోడు కనీసం నెలనెలా వేతనం చెల్లించకున్నా పట్టించుకునేవారు కరువయ్యారని సిబ్బంది మండిపడుతున్నారు. రోజూ తాము ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నా వేతనం చెల్లించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి వేతనాలు విడుదల చేయాలని, తమ ఉద్యోగాలు క్రమబద్ధీకరించి వేతనం పెంచాలని సిబ్బంది కోరుతున్నారు.
వేతనాలు చెల్లించేదెన్నడు?
Published Thu, Jul 10 2014 2:16 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement