ఇందూరు, న్యూస్‌లైన్: వేసవిలో జిల్లా ప్రజలకు తాగునీటి సమస్య లు తలెత్తకుండా గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. పని చేయని బోర్ల మరమ్మతులతోపాటు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాల్సిన ప్రాంతాలను గుర్తించారు. అయితే, ఈసారి వేసవిలో తాగునీటి ఎద్దటి తీవ్రంగా ఉండబోదని అధికారులు పేర్కొంటున్నారు. ఆశించిన దానికం టే అధిక వర్షపాతం నమోదు కావడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. భూగర్భ జలాలు పు ష్కలంగా ఉన్నాయంటున్నారు. అయినా, ఎక్క డా ఎలాంటి నీటి ఎద్దడి ఏర్పడకుండా జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ముందస్తు చర్యలలో భాగంగా మండలాలవారీగా ఏఈలు సర్వే నిర్వహించి నివేదికను తయారు చేశారు. వేసవిలో నీటి ఎద్దడి తీర్చడానికి సుమారు రూ. కోటిన్నర నిధులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ప్రతిపాదనలను ఉ న్నతాధికారులకు, జిల్లా కలెక్టర్‌కు సమర్పించారు.
వేసవి ప్రణాళిక ఇలా
జిల్లాలో సుమారు 1,800 ఆవాస ప్రాంతాలున్నాయి. ఇందులో 1,054 ప్రాంతాలలో తాగునీటి సరఫరా ఉంది. 590 ప్రాంతాలలో పాక్షికంగా నీటి సరఫరా జరుగుతోం ది. 159 ప్రాంతాలలో సరఫరా అసలే లేదు. కొన్ని చోట్ల నీటి సరఫరా ఉన్నప్పటికీ నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంది. సురక్షితం కాని ఈ ప్రాంతాలకు సీపీడబ్ల్యూ, పీడబ్ల్యూసీ, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ల ద్వారా నీరు అందించడానికి చర్యలు చేపట్టనున్నారు. అలాగే 39 గ్రామాలలో అద్దె బోరుల ద్వారా, 31 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నారు. పని చేయకుండా ఉన్న 347 బోర్లు, మోటార్లు, చేతి పంపులకు మరమ్మతులు చేయించనున్నారు. 77 గ్రామాలకు వాటర్ ట్యాంక్‌లను నిర్మించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు.
పుష్కలంగా నిధులు
వేసవిలో తాగునీటి సరఫరాకు కావాల్సిన నిధులు పుష్కలంగా ఉన్నాయి. సీపీడబ్ల్యూ పథకానికి సంబంధించినవాటికి జిల్లా పరిషత్ 13వ ఆర్థిక సంఘం నిధులు న్నా యి. పీడబ్ల్యూసీ పథకాలకు సంబంధించినవాటికి గ్రామ పంచాయతీ నిధులతో పాటు 13వ ఆర్థిక సంఘం నిధులున్నాయి. మళ్లీ ప్రభుత్వం వేసవి కోసం మంజూరు చేసే నిధులు వేరు. వీటిని ప్రణాళిక బద్ధంగా వినియోగించడానికి ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నారు.
ఎండలలో గొంతెండదు
Published Thu, Mar 13 2014 3:21 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement
Advertisement