ఇదే అసలైన పండగ | Sakshi Holiday Celebrations.. | Sakshi
Sakshi News home page

ఇదే అసలైన పండగ

Published Mon, Dec 29 2014 1:42 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Sakshi Holiday Celebrations..

సాక్షి పండగ సంబరాల్లో  లక్ష విజేత ఆర్.సూరిబాబు
ప్రకటించిన ఎమ్మెల్యే గణబాబు
కళ్యాణి షాపింగ్‌మాల్‌లో సందడి

గోపాలపట్నం : సాక్షి లక్ష రూపాయల బంపర్ డ్రాలతో కొనుగోలుదారుల ఇళ్లలో సంప్రదాయ సంక్రాంతి పండగకి ముందే పండగొచ్చేసిందని ఎమ్మె ల్యే పి.గణబాబు సంతోషం వ్యక్తం చేశారు. గోపాలపట్నం కళ్యాణి షాపిం గ్ మాల్‌లో ఆదివారం సాయంత్రం సాక్షి యాజమాన్యం, కళ్యాణి షాపింగ్‌మాల్ సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో కొనుగోలుదారుల సందడి నడుమ ఆయన  లక్షరూపాయల బంపర్‌డ్రా తీశారు.

లక్ష రూపాయల డ్రా విజయనగరం జిల్లా గంట్యాడకు చెందిన ఆర్.సూరిబాబుని వరిం చి నట్టు గణబాబు ప్రకటించారు. కంగ్రాట్యులేషన్స్ సూరిబాబుగారూ... అంటూ ఎమ్మెల్యే ఫోన్లో అభినందనలు తెలిపారు. సూరిబాబు వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తాను రైతు కుటుం బానికి చెందిన వ్యక్తినని సూరిబాబు ఉబ్బితబ్బిబ్బవుతూ చెప్పాడు. పండగముందు ఊహించని తీపికబురు చెప్పినందుకు ఎమ్మెల్యేకి సూరి బాబు కృతజ్ఞతలు తెలిపారు.

గణబాబు మాట్లాడుతూ గోపాలపట్నం పట్టణీకరణగా రూపుదిద్దుకున్న తరుణంలో ఇలా వినూత్న పోటీ ప్రోత్సాహకాలు సంక్రాంతి పండగముందు ఇవ్వడం కొనుగోలుదారులకు ఆనందంగా ఉంటుందన్నారు. ఇక్కడి కళ్యాణి షాపింగ్‌మాల్ అనతికాలంలోనే అభివృద్ధి చెందిందని అన్నారు. శనివారం ప్రకటించిన  లక్షరూపాయల విజేత కు మార శ్రీనివాస్‌ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో సాక్షి యాడ్స్ ఏజీఎం బి.రంగనాథ్, ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్ అధినేత ఎస్‌ఆర్ గోపీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement